English   

మెగాస్టార్ సినిమాలో నాని హీరోయిన్

chiru
2019-05-28 19:35:00

కన్నడ యూటర్న్ సినిమాతో హిట్ కొట్టి తెలుగులో నానితో జెర్సీ సినిమాతో తెరంగ్రేట చేసిన కన్నడ భామ శ్రద్ధా శ్రీనాథ్ కి వరుస అవకాశాలు వస్తున్నాయి. జెర్సీ సినిమాలో ఈ అమ్మడి సహజ నటన చూసి మన దర్శకనిర్మాతలు ఈ అమ్మాయిని సినిమాల్లోకి తీసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇక తాజాగా ఈ జాబితాలో స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కూడా చేరారు. సైరా తరువాత మెగాస్టార్ చిరంజీవి కొరటాల డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో మెయిన్ లీడ్ గా అనుష్క పేరు పరిశీలిస్తున్నారు. మరో కథానాయికగా శ్రద్ధా శ్రీనాథ్ ను ఎంపిక చేసే ఆలోచనలో కొరటాల ఉన్నారని తెలుస్తుంది.  క‌న్న‌డ `యు ట‌ర్న్‌`తో హీరోయిన్‌గా ప‌రిచ‌య‌మైన శ్ర‌ద్ధా ఆ సినిమాతో మంచి పేరు కొట్టేసింది. ఇక ఈ సినిమా దెబ్బకి టాలీవుడ్ లో చాన్స్ కొట్టేసింది, ఇక ఆ సినిమాతో ఏకంగా మెగాస్టార్ పక్కనే ఛాన్స్ కొట్టేసింది ఈ కన్నడ భామ.

More Related Stories