English   

యంగ్ హీరోకి ఛాన్స్ ఇస్తున్న నాని

nani
2019-05-28 20:56:09

మళయాలంలో హిట్ కొట్టిన అంగమలై డైరీస్ సినిమాని తెలుగులో విశ్వక్ సేన్ నటిస్తూ, దర్శకత్వం వహిస్తూన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఈ శుక్రవారం రిలీజ్ కానుండగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరిగింది. ఈ కార్యక్రమానికి నేచురల్ స్టార్ నాని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఒక ఆసక్తికర అప్డేట్ ఇచ్చారు. అదేంటంటే ఫలక్ నామా దాస్ సినిమా హీరో, దర్శకుడు విశ్వక్ సేన్ తో త్వరలో నాని నిర్మాణ సంస్థలో హీరోగా ఒక సినిమా ప్లాన్ చేస్తున్నాడట. న్యూ టాలెంట్‌ను ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో వాల్ పోస్టర్ సినిమా అనే నిర్మాణ సంస్థను స్థాపించిన నాని గతంలో ‘అ !’ అనే సినిమాను రూపొందించిన విషయం తెలిసిందే. అయితే అ! సినిమా కమర్షియల్‌గా సక్సెస్‌ కాకపోవటంతో వెంటనే మరో సినిమాను నిర్మించలేదు. అయితే ఇప్పుడు విశ్వక్ సేన్ తో సినిమా చేయనున్నడన్న మాట. ఇక విశ్వక్ సేన్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం. ఈ సినిమా ఈ నెల 31న విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

More Related Stories