English   

అమ్మాయిల రూమ్ లో వర్మ

ramgopalvarma
2019-05-28 21:32:20


అమ్మాయిల రూమ్ లో ఈ వర్మ ఏమి చేస్తున్నాడు ? అనే అనుమానం కలగొచ్చు. నిజానికి విజయవాడలో ఉన్న ఆయన తాను చదువుకున్న కాలేజీకి వెళ్ళిన వర్మ తన పాత జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకుంటూ ట్వీట్ చేశారు వర్మ. అంతేకాదు తాను రెండేళ్ల పాటూ ఉన్న హాస్టల్ రూమ్‌కు వెళ్లారు. ఆ రూమ్‌లను ఇప్పడు లేడీస్ హాస్టల్స్‌గా మార్చేయగా.. అక్కడే ఉన్న విద్యార్థినిలుతో ఫోటో దిగారు. ఆ ఫోటోను ట్వీట్‌ చేస్తూ ‘సిద్ధార్థ ఇంజినీరింగ్ కాలేజీలో చదువుకొనే రోజులు.. రెండేళ్లలో ఇదే గదిలో ఉన్నా. ఇది మా కాలేజీ వెనకవైపు ఉండేది నా ఇంజినీరింగ్ కాలేజీ జీవితం దాదాపు ఇక్కడే గడిచింది. దీనిని లేడీస్ హస్టల్‌గా మార్చారు. ఇక్కడున్న ఈ లవ్లీ గర్స్ ఇప్పుడు రూమ్‌మేట్స్‌గా ఉంటున్నారు. నేను నిలబడిన వెనుకవైపు శ్రీదేవి ఫొటో కూడా ఉండేది’ అంటూ ట్వీట్ చేశారు. ఇక చివరికి వర్మ తన పంతాన్ని నెగ్గించుకున్నాడట. ఏపీలో లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదలకు బాబు అడ్డంకులు సృష్టించారని ఆరోపించిన వర్మ తాజాగా ఎన్టీఆర్ జయంతి రోజున పైపుల రోడ్డులో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. దీనిపైన ట్వీట్ చేసిన వర్మ మొత్తానికి అనుకున్నది చేసేశా అంటూ చెప్పుకొచ్చారు.

More Related Stories