English   

గ్యాప్ పెరిగింది....అందుకే పార్టీ పెడతా ?

prakash
2019-05-28 22:03:15

మోడీ ప్రధాని అయిన నాటి నుండే ఆయన మీద వ్యతిర గళం విప్పి మోడీ భక్తుల ఆగ్రహానికి గురయ్యాడు. మోడీ వ్యతిరేకంగా లోక్ సభలో తన గొంతు వినిపించాలని బెంగుళూరులో ఇండిపెండెంట్ గా పోటీ చేసినా అతనికి ప్రజల నుంచి మద్దతు మాత్రం లభించలేదు. అయితే ఓడిపోయిన తర్వాత ఏర్పాటు చేసిన మీడియా మీట్ లో ఆయన ఒక ఓ ఆసక్తికర ప్రకటన చేశారు. ఈ ఎన్నికల్లో తాను ఇండిపెండెంట్ గా నిలబడడంతో జనానికి తనకీ మధ్య గ్యాప్ వచ్చిందని అందుకే త్వరలోనే సొంత రాజకీయ పార్టీని ఏర్పాటు చేయాలని ఫిక్స్ అయినట్టు ఆయన పేర్కొన్నారు. మరో ఏడాదిలో బెంగళూర్‌లో కార్పొరేషన్‌ ఎన్నికలు జరగనున్నాయని, ఆ ఎన్నికల్లో తమ పార్టీ తరఫున అభ్యర్థులను పోటీకి నిలిపి పోటీ చేసి ప్రజా మద్దతు పొందుతామని పేర్కొన్నారు. తాను రాజకీయ పార్టీని ప్రారంభించినా, సినిమాల్లో నటించడం మానుకోనని, పార్టీని నడపడానికి డబ్బు అవసరం అవుతుందని, అందుకే నటనను కొనసాగిస్తానని ఆయన చెప్పారు

More Related Stories