English   

జగన్ అన్న గెలిచినందుకు సంతోషంగా ఉంది : హీరో సూర్య 

Jagan
2019-05-29 08:55:43

తమిళంతోపాటు తెలుగులోనూ తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ బేస్ కలిగిన నటుడు సూర్య. ఆయన నటించిన తాజా మూవీ ఎన్జీకే (నంద గోపాలకృష్ణ) ఈ శుక్రవారం రిలీజ్ కానుంది. ఈ నేపధ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ కాబోయే ముఖ్యమంత్రి గురించి మాట్లాడిన అయన జగన్‌ ను తను జగన్ అన్నా అని పిలుస్తానని, జగన్ తమ్ముడు అనిల్ రెడ్డి తనకు క్లాస్‌మేట్, బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పిన సూర్య చెన్నైలో ఐస్‌క్రీంలు తినడం కోసం తామంతా తరచుగా బయటకు వెళ్లే వాళ్లమని ఆనాటి రోజులు గుర్తు తెచ్చుకున్నారు. అనిల్ ద్వారా జగన్ ఫ్యామిలీకి తాను దగ్గరయ్యానని చెప్పుకొచ్చారు. ‘‘పదేళ్ల క్రితం జగన్ అన్న కుటుంబానికి, రాష్ట్రానికి పెద్ద నష్టం జరిగింది అని, పదేళ్ల కష్టానికి దక్కిన ప్రతిఫలం ఇది అని ఆయన చెప్పుకొచ్చాడు. ప్రజలు కోరుకునే మార్పును ఆయన సాధిస్తారని అనుకుంటున్నానని, జగన్‌ ఒక సక్సెస్‌ఫుల్‌ పొలిటీషియన్‌ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. ఆయన ఎప్పటికీ అలాగే ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు. ఆయన దేశంలో రెండో పిన్న వయస్కుడైన సీఎం అని సూర్య చెప్పుకొచ్చారు.  

More Related Stories