English   

ఓటమి తర్వాత కొత్త లుక్ లోకి మారిన పవన్ 

Pawan Kalyan
2019-05-29 11:45:50

తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగిన జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు ఘోర పరాభవం ఎదురైన సంగతి తెలిసిందే. బీఎస్పీ, వామపక్షాల మద్దతుతో దాదాపు అన్ని నియోజకవర్గాలలోనూ పోటీ చేసిన పవన్‌ కు ఈ ఎన్నికలు చేదు ఫలితాన్ని మిగిల్చాయి. ప్రశ్నిస్తా అంటూ ప్రజల ముందుకు వచ్చిన పవన్‌ రెండు చోట్ల ఓడిపోవడంతో జనసేన భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఈ సమయంలో ఆయన కొద్ది రోజుల నుండీ కనపడడం లేదు, ఎన్నికల ఫలితం వచ్చిన తర్వాత మీడియా ముందుకు వచ్చిన పవన్ ఆ తర్వాత ఆయన కనపడడమే మానేసాడు. ఇక తాజాగా ఆయన మళ్ళీ మామూలు లుక్ లోకి మారిపోయి దర్శనం ఇచ్చాడు. నిజానికి ఎన్నికల ప్రచారం మొదలు పెట్టిన నాటి నుండి పంచేకట్టుత్తో కనిపించిన అయన మళ్ళీ జీన్స్ టీ షర్ట్ లోకి మారిపోయి అభిమానులకి షాక్ ఇచ్చాడు. ఇక ఈ లుక్ చూసిన కొంసారు నెటిజన్లు అప్పుడే ఆడుకోవడం మొదలు పెట్టారు అనుకోండి అది వేరే విషయం. ఎన్నికల హడావిడి అయిపొయిందిగా పవన్ ఒరిజినల్ లుక్ లోకి వచ్చేసాడని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ఆయనని ట్రోల్ చేస్తున్నారు.

More Related Stories