English   

తమిళ, మళయాళంలోకి రీమేక్ అవుతున్న కంచరపాలెం 

 Kancharapalem
2019-05-29 12:02:14

గత ఏడాది రిలీజ్ అయి హిట్ అయిన అతి కొద్ది సినిమాల్లో ఒకటి కేరాఫ్ కంచరపాలెం. ఈ సినిమాకి అసలు నెగటివ్ రివ్యూస్ అనేవే రాలేదంటే ఈ సినిమా ఎంత బాగా తెరకేక్కించారో అర్ధం చేసుకోవచ్చు. విజయవాడ కుర్రాడు వెంక‌టేష్ మ‌హా తెర‌కెక్కించిన `కేరాఫ్ కంచ‌ర‌పాలెం` తెలుగులో మంచి విజ‌యం సాధించి అనేక అంతర్జాతీయ అవార్డులు సైతం అందుకుంది. కొత్త వాళ్ల‌తో తెర‌కెక్కిన సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ అందుకుని రానా సమర్పణలో విడుద‌ల చేయ‌డంతో సినిమాకు మంచి బూస్టింగ్ దొర‌కినట్టయింది. కంటెంట్ అద్భుతంగా ఉండడంతో ద‌ర్శ‌కుడికి మంచి పేరు వ‌చ్చింది. ఇప్పుడీ సీనిమా త‌మిళ్ తో పాటు మలయాళంలో రీమేక్ చేయ‌డానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి. గతంలో కలర్స్ స్వాతి తో త్రిపుర సినిమా నిర్మించిన రాజ‌శేర్ రెడ్డి ఈ సినిమాని రెండు భాష‌ల్లో నిర్మిండానికి ముందుకొచ్చిన‌ట్లు తెలుస్తోంది. తెలుగులో ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన వెంట‌కేష్ ఈ రెండు బాషలలో కూడా దర్శకత్వ బాధ్య‌త‌లు తీసుకోనున్నాడ‌ని స‌మాచారం. కేరాఫ్‌ కంచెరపాలెం సినిమాకి కనెక్ట్‌ అయిన రాజశేఖర్‌ రెడ్డి సురేశ్‌ బాబు దగ్గరికెళ్లి ఫ్యాన్సీ రేట్‌ ఇచ్చి మరీ ‘కేరాఫ్‌ కంచెరపాలెం’ చిత్రం తమిళ, మలయాళ రైట్స్‌ను సొంతం చేసుకున్నాడట. చూడాలి మరి ఏమవుతుందో ?

More Related Stories