English   

జగన్ ఆర్మీతో కలిసి శ్రీవారిని దర్శించుకున్న వర్మ

RGV
2019-05-29 13:32:29

ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ ఈరోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా జగన్ తో పాటు పలువురు గెలుపొందిన వైసీపీ ఎమ్మెల్యేలు మరికొందరు నాయకులు తరలి వచ్చారు. వారితో పాటు వచ్చిన వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, సంప్రదాయ దుస్తుల్లో స్వామిని దర్శించుకున్నారు. ఇంతకుముందు లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ప్రారంభం టైమ్‌లో ఫస్ట్ టైమ్ తిరుపతి గుళ్లోకి అడుగు పెట్టిన వర్మ, ఇప్పుడు మరోసారి వెంకటేశ్వరుడి సన్నిధినిలో ప్రత్యక్ష మయ్యాడు. ఈ మేరకు ఒక ట్వీట్ చేశారు, 'దైవ దర్శనం 2.ఓ.. తిరుపతి ఆలయంలో వైఎస్ జగన్‌ని అతని 150 మంది ఆర్మీ అదే ఎమ్మెల్యేలతో కలిసి చూడడం అద్భుతంగా అనిపించింది.. ఎప్పటికీ జగనే ముఖ్య మంత్రిగా ఉండాలని ప్రేయర్ చేసాను. అలాగే నేను తియ్యబోయే 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' సినిమాకు దీవెనలు అందించాలని కోరుకున్నాను' అని ట్వీట్ చేసాడు.. వర్మతో పాటు నిర్మాత రాకేష్ రెడ్డి కూడా ఉన్నాడు. దర్శనానంతరం మీడియాతో మాట్లాడిన ఆయన, జగన్ కు తాను తీసిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రాన్ని చూపిస్తానని చెప్పారు. తన కొత్త చిత్రం విడుదల సందర్భంగానే స్వామిని దర్శించుకున్నానని, జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయగానే, ప్రత్యేకంగా చిత్రాన్ని ఆయనకు చూపిస్తానని అన్నారు.  
 

More Related Stories