English   

సాహో నుండి వారు తప్పుకున్నది అందుకేనట...ఇక ఆయనే ?

 Ghibran
2019-05-29 14:10:07

శరవేగంగా షూటింగ్ జరుపుకుంటూ ఆగస్టు 15న విడుదలకు సిద్ధమవుతోన్న ప్రభాస్ తాజా సినిమా సాహోకు షాక్ ఇస్తూ ఈ సినిమా నుంచి తప్పుకుంటున్నట్లు సంగీత త్రయం శంకర్ ఎహసాన్ లాయ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మ్యూజిక్‌ త్రయం సాహో టీమ్‌ నుండి తప్పుకోవడానికి అసలు కారణాలేంటో తెలుసుకునే ప్రయత్నం చేయగా వీరితో పాటు ఇంకొంత మంది సంగీత దర్శకులను కూడా ఈ ప్రాజెక్టులో భాగం చేయబోతున్నట్లు చెప్పడంతో శంకర్ ఎహసాన్ లాయ్ త్రయం ఈ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. తమతోపాటు మరో సంగీత దర్శకుడు ఈ చిత్రానికి పనిచేస్తే తమకు అసౌకర్యంగా ఉంటుందని, దానికి తాము అంగీకరించబోమని చెబుతున్నారు. అందుకే ఈ భారీ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారని సమాచారం. కొన్ని పాటలను వేరే కంపోజర్స్‌తో చేయించాలని మ్యూజిక్ కంపెనీ అనుకుందని అది చాలా అసౌకర్యంగా ఉంటుందని కానీ కుదరదని చెప్పడంతోనే పూర్తిగా తప్పుకున్నామని వారు చెబుతున్నారు. ఇక ఈ సినిమా కోసం సంగీత దర్శకుడు గిబ్రాన్‌ని తీసుకున్నారని తెలుస్తోంది. ఇప్పటికే సాహో ఛాప్టర్‌ 1, చాప్టర్‌ 2 కి బ్యాక్‌ గ్రౌండ్‌ మ్యూజిక్‌ అందించాడు గిబ్రాన్‌.  

More Related Stories