English   

భీష్మ ఇప్పటికయినా మొదలువుతుందా ?

 Nithiin
2019-05-29 15:29:47

వరుస ఫ్లాప్ సినిమాలతో అసలు సినిమాలే చేయకుండా గ్యాప్ ఇచ్చాడు, యువ హీరో నితిన్, ఈ మధ్యనే వరుసగా నాలుగు సినిమాలు ప్రకటించి హాట్ టాపిక్ గా మారినా, ఇంకా ఏ సినిమా మొదలు పెట్టలేదు. చివ‌రిగా ఛ‌లో ద‌ర్శ‌కుడితో ఆయన సినిమా మొదలు పెట్టనున్నట్టు సమాచారం. ముందు నుంచి ఈ కాంబినేష‌న్ నే సెట్స్ కు వెళ్తుంద‌ని ప్ర‌చారం జరిగినా అనుకోని కారణాల వలన ఈ సినిమా ఆలస్యం అవుతూ వచ్చింది. వెంకీ కుడుముల దర్శకత్వంలో వచ్చిన ఛలో యూత్ ను ఆకట్టుకుని మంచి వసూళ్లతో విజయాన్ని మూటగట్టుకుంది. దాంతో ఆయన నితిన్, రష్మికలతో భీష్మ ప్లాన్ చేశాడు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కి తేదీ ఖరారు చేసుకుంది. జూన్ 7న సినిమా ప్రారంభంచాడానికి ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. సితార ఎంట‌ర్ టైన్ మెంట్స్ బ్యానర్ మీద సూర్య దేవ‌ర నాగ‌వంశీ చిత్రాన్ని నిర్మిస్తున్న ఈ సినిమా మీద నితిన్ చాలా ఆశలు పెట్టుకున్నాడు.  

More Related Stories