English   

ఎన్టీఆర్ ఇంకా కోలుకోలేదా ?

 Tarak
2019-05-29 16:49:41

ఆర్ఆర్ఆర్ సినిమా షూట్ లో భాగంగా ఎన్టీఆర్ గాయ‌ప‌డిన సంగ‌తి తెలిసిందే. ఎన్టీఆర్ ఎడమ చేతికి గాయ‌మ‌వ్వ‌డంతో ఆయన ఆర్‌ఆర్‌ఆర్‌ షూటింగ్‌ లో పాల్గొనలేక బ్రేక్ తీసుకుంటున్నాడు. నిజానికి దీనికి ముందే రామ్ చ‌ర‌ణ్‌ కూడా జిమ్‌ లో క‌స‌ర‌త్తులు కాలికి గాయం చేసుకున్నాడు. దాంతో ఆ సమయంలో ఈ ఇద్ద‌రు హీరోలూ ఆర్‌ఆర్‌ఆర్‌కి అందుబాటులో లేకుండా పోయారు. దాంతో షూటింగ్ కూడా ఆగిపోయింది. అయితే ఎన్టీఆర్, చరణ్ లు గాయం నుంచి కోలుకున్నాడ‌ని, హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్ట‌రీలో ఈ సినిమా కోసం వేసిన ప్ర‌త్యేక సెట్లో ఆర్‌ఆర్‌ఆర్‌ షూటింగ్ జ‌రుగుతోంద‌ని రెండ్రోజుల క్రితం వార్త‌లొచ్చాయి. అయితే నిన్న ఎన్టీఆర్ జ‌యంతి సంద‌ర్భంగా అయనకు నివాళులు అర్పించడానికి ఎన్టీఆర్ ఘాట్‌కి వ‌చ్చాడు జూనియ‌ర్‌. ఆ స‌మ‌యంలో ఎన్టీఆర్ చేతికి క‌ట్టు క‌నిపించింది. అంటే ఎన్టీఆర్ ఇంకా గాయం నుంచి కోలుకోలేద‌ని నిర్దార‌ణ అయ్యింది. అయితే ఆయన గాయం నుంచి కోలుకుంటే త‌ప్ప‌ ఆర్‌ఆర్‌ఆర్‌ షూట్ లో పాల్గొనే అవకాశం అయితే లేదు. దీంతో ఆర్‌ఆర్ఆర్‌ షూటింగ్ మ‌ళ్లీ మొద‌లైంద‌న్న మాట‌ల్లో నిజం లేదేమో ?

More Related Stories