English   

త్వరలో టాలీవుడ్ హీరో ప్రేమ పెళ్లి ?

Raj Tarun
2019-05-29 17:44:40

ఉయ్యాల జంపాల సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి పరిచయమైన హీరో రాజ్ తరుణ్. కెరియర్ ఆరంభంలోనే దూకుడు చూపించిన ఈ యూత్ హీరో కి ఈ మధ్య వరుస పరాజయాలు ఎదురవుతూ వస్తున్నాయి. గతేడాది వచ్చిన మూడు సినిమాలు ‘రంగుల రాట్నం’, ‘రాజు గాడు’, ‘లవర్’ ఈ మూడు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలవడంతో ఆయన డీలా పడిపోయాడు. ప్రస్తుతానికి ఆయనకి దిల్ రాజు నిర్మాతగా ఒక సినిమా చాన్స్ వచ్చింది. అలా ప్రస్తుతం 'ఇద్దరి లోకం ఒకటే' సినిమాలో నటిస్తున్న  ఆయన, త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్నాడట. ఈ విషయాన్ని తాజాగా ఆయనే  అభిమానులకి తెలియజేశాడు. అయితే పెళ్లికూతురు ఎవరు ? ఇండస్ట్రీకి సంబంధించిన అమ్మాయా? బయట అమ్మాయా? అనే విషయాన్ని మాత్రం ఆయన సస్పెన్స్ లోనే ఉంచాడు. త్వరలోనే ఆ విషయాలు కూడా చెబుతాడేమో చూడాలి. రెండు రోజుల క్రితం ‘ఆస్క్ రాజ్’ పేరుతో ట్విట్టర్‌లో ఫ్యాన్స్‌తో రాజ్ తరుణ్ చిట్ చాట్ నిర్వహించాడు. చాలా మంది చాలా ప్రశ్నలు అడిగారు. అలా వచ్చిన ప్రశ్నలలో ఈ పెళ్లి ప్రశ్న ఒకటి.  

More Related Stories