English   

మెహరీన్ డబుల్ చేసిందా ? 

Mehreen Kaur
2019-05-29 18:37:26

న‌టుడు నాగ‌శౌర్య, మెహరీన్ జంట‌గా ఈ మధ్యనే ఒక సినిమా స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే. శౌర్య సొంత ప్రొడక్షన్ సంస్థ అయిన ఐరా క్రియేషన్స్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా మొదటి షెడ్యూల్ పూర్తయ్యిందట. హైద‌రాబాద్ లో ఓక కాలనీలో మొద‌టి షెడ్యూల్ ని విజ‌య‌వంతంగా పూర్తిచేశారట. ర‌మ‌ణ‌తేజ అనే యువకుడు ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్న ఈ సినిమా రెండ‌వ షెడ్యూల్ ని జూన్ లో ప్లాన్ చేస్తున్నారు. అయితే మెద‌టి షెడ్యూల్ అవుట్ పుట్ చాలా బాగా వచ్చిందని ద‌ర్శ‌కుడు కొత్త వాడయినా అవుట్ పుట్ మాత్రం చాలా బాగుందని చెబుతుంది యూనిట్.  ఇక ఈ సినిమాకి అశ్వ‌ద్ధామ‌ అనే పేరు ప‌రిశీలిస్తుంది సినిమా యూనిట్. నిజానికి ఈ సినిమా కోసం ముందుగా ర‌ష్మిక‌ని అనుకున్నారు కానీ ఈ సినిమాలో న‌టించ‌డానికి కాల్షీట్ల స‌మ‌స్య వ‌ల్ల ర‌ష్మిక నటించలేకపోయింది. ఆమె ప్లేస్ లో మెహ‌రీన్‌ని తీసుకున్నారు. అయితే ఈ సినిమాకి గానూ మెహ‌రీన్ కి ఏకంగా 80 ల‌క్ష‌ల పారితోషికం తీసుకుంటుందని సమాచారం. నిజానికి ఇప్ప‌టి వ‌ర‌కూ మెహ‌రీన్ పారితోషికం 50 ల‌క్ష‌ల కంటే తక్కువే కానీ ఓకే దెబ్బకే అది డ‌బుల్ అయ్యింది. ఇదంతా ఎఫ్ 2 హిట్టు వ‌ల‌నే అని అనుకుంటున్నారు.

More Related Stories