English   

నాగాశౌర్య వద్దనుకున్న సినిమా చేత్శున్న నందమూరి హీరో

kalyanram
2019-05-29 20:06:23

శతమానం భవతి సినిమాతో జాతీయ అవార్డు అందుకున్న సతీష్ వేగేశ్న రెండో సినిమాగా తీసిన శ్రీనివాస కళ్యాణం భారీ డిజాస్టర్ గా నిలిచింది. దీంతో ఆయనకు ఆఫర్స్ రావడం కష్టంగా మారింది. అయితే నాగశౌర్యకి ఆయన ఒక కధ చెప్పగా  ఆల్ ఈజ్ వెల్ అనే టైటిల్ తో ఓ సినిమా ప్లాన్ చేశారు. అయితే ఏమయిందో ఏమో కానీ అది ఇప్పుడు కళ్యాణ్ రామ్ చేతికి వెళ్లిందట. తాజా సమాచారం ప్రకారం నందమూరి కళ్యాణ్ రామ్‌కు రీసెంట్‌గా సతీష్ ఇదే కథ వినిపించినట్లు తెలుస్తోంది. కళ్యాణ్ రామ్‌కు కథ నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చాడని సమాచారం. ఇక ఈ ప్రాజెక్ట్ గురించి త్వరలోనే అధికారిక ప్రకటన రానుందట. త్వరలోనే ఈ మూవీ లాంఛనంగా ప్రారంభం అవుతుందని అంటున్నారు. ఆదిత్య మ్యూజిక్ బ్యానర్ మీద ఉమేష్ గుప్తా నిర్మాతగా ఈ మూవీ తెరకెక్కనుంది.

 

More Related Stories