English   

మల్లేశం ట్రైలర్ టాక్

mallesham
2019-05-29 20:53:40

చేనేత ఆసు యంత్రాన్ని కనుగొన్న చింతకింది మల్లేశం జీవితగాధ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘మల్లేశం. ఓ సామాన్యుడి అసామాన్య గాథ అనే ట్యాగ్ లైన్ తో జూన్ 21న విడుదలవుతున్న ఈ సినిమా ట్రైలర్ కాసేపటి కిందట ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చేనేత పనిలో తల్లి పడుతున్న కష్టాన్ని చూసిన కొడుకు మల్లేశం ఆసు యంత్రాన్ని కనుగొన్న తీరును ఈ సినిమాలో చూపారు. పూర్తిస్థాయి తెలంగాణ యాసతో ఉన్న ఈ ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో మల్లేశం తల్లి పాత్రలో ఝాన్సీ నటించింది. ఈ చీరకు అసు పని చేసేందుకు తన తల్లి పడుతున్న శ్రమని చూసిన మల్లేశం ఆ శ్రమ నుంచి తప్పించుకొనేందుకు ఆసు యంత్రాన్ని కనిపెడతాడు. అలా కనిపెట్టేందుకు పడ్డ కష్టాన్నే సినిమాలో హైలైట్ చేశారు. మల్లేశం పాత్రలో ప్రియదర్శి, ఆసు యంత్రాన్ని కనిపెడున్న సన్నివేశాలు ట్రైలర్ లో హైలైట్. చివర్లో ‘అసలు కథ మొదలైంది ఇప్పుడే.. ముందుంది ముసళ్ల పండుగ’ అంటూ దర్శి చెప్పిన డైలాగ్ ట్రైలర్‌కు హైలైట్‌గా నిలిచింది. రాజ్‌.ఆర్‌ దర్శకుడిగా తెరకెక్కుతున్న ఈ సినిమాని సురేశ్ ప్రొడెక్షన్ బ్యానర్‌పై విడుదల చేస్తున్నారు. 

 

More Related Stories