English   

రెండో షెడ్యూల్ లో డిస్కో రాజా

disco
2019-05-29 21:09:20

నేల టికెట్ సినిమా దెబ్బ వేశాక రవితేజ చాలా గ్యాప్ తీసుకుని కథానాయకుడిగా వి.ఐ.ఆనంద్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా డిస్కోరాజా. పాయల్‌ రాజ్‌పుత్, నభా నటేష్‌ కథానాయికలుగా నటిస్తున్న ఈ సినిమాని నేల టికెట్ ప్రొడ్యూస్ చేసిన రామ్‌ తాళ్లూరి నిర్మిస్తున్నారు. ఈరోజు నుంచి ఈ సినిమా రెండో షెడ్యూల్‌ మొదలయ్యింది. ఈ షెడ్యూల్ లో హీరో రవితేజ తో ముఖ్య పాత్రధారులు పాల్గొంటున్నారు. హైద‌రాబాద్ అల్యూమినీయం ఫ్యాక్ట‌రీలో భారీగా వేసిన‌ సెట్ లో ప్ర‌స్తుతం హీరో, విలన్ మ‌ధ్య యాక్షన్ సీన్స్ షూట్ చేస్తున్నారు. ఇక వచ్చే నెల 21 వరకు హైదరాబాద్‌ లో నే ఈ షెడ్యూల్ ఉంటుందట. విజువల్‌ ఎఫెక్ట్స్‌ కూడా ఈ సినిమాలో ఎక్కువగానే ఉంటాయని అంటున్నారు. తమిళ విలన్ బాబీ సింహా, వెన్నెల కిషోర్, సత్య, సునీల్ తదితరులు నటిస్తున్న ఈ సినిమా అయినా మంచి హిట్ ఇస్తుందని రవితేజ మంచి ఆశలు పెట్టుకున్నాడు మరి ఏమి అవుతుందో ?

 

More Related Stories