English   

అర్ధాంతరంగా ఆగిన హృతిక్ సినిమా...టెర్రరిస్ట్ ల దెబ్బ ?

Hrithik Roshan
2019-05-30 09:37:36

బాలీవుడ్‌ స్టార్ హీరో హృతిక్‌ రోషన్‌ నటిస్తున్న ఓ సినిమా షూట్ లో ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వం వహిస్తున్న సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతోంది. ఈ సినిమాలో ఇద్దరు జూనియర్‌ ఆర్టిస్ట్‌లు ఉగ్రవాదుల పాత్రలు పోషిస్తున్నారు. దాంతో బుల్లెట్‌ ప్రూఫ్‌ వెస్ట్‌లు ధరించి, సూసైడ్‌ బాంబర్స్‌ గెటప్‌ వేసుకున్న వారు షూట్ గ్యాప్ లో అవే గెటప్‌ లతో పక్కనే ఉన్న ఓ పాన్ షాప్ కి వెళ్లారు. అంతే జూనియ‌ర్ ఆర్టిస్టుల‌ను చూసి ఉగ్ర‌వాదులు అనుకున్నారు స్థానికులు. పోలీసుల‌కు కూడా ఫోన్ చేయ‌డంతో వారు రావడంతో విషయం పెద్దది అయ్యింది. పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని ఆ ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. తాము జూనియర్‌ ఆర్టిస్ట్‌లమని ఎంత చెప్పినా పోలీసులు వినలేదు సరికదా వారిని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్ళి విచారించడం మొదలుపెట్టారు. నిర్మాతలకి విషయం తెలియడంతో రావడంతో వారు వెంటనే పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి జూనియర్‌ ఆర్టిస్ట్‌ల ఐడీలు చూపించిన తర్వాత పోలీసులు వారిని వదిలేశారు. ఈ ఘటనతో షాక్ లో ఉన్న యూనిట్ షూట్ ని ప్రస్తుతానికి నిలిపివేశారు. ఈ సినిమాలో హృతిక్‌తో పాటు టైగర్‌ ష్రాఫ్‌ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు.  

More Related Stories