English   

మహేష్ సినిమాకి ప్రొడ్యూసర్ గా కొరటాల

 Koratala Siva
2019-05-30 12:02:30

కెరీర్ మొదలు పెట్టిన నాటి నుండి అసలు ఫ్లాప్ అనేదే లేకుండా దూసుకు వెళ్తున్న తెలుగు డైరెక్టర్ లలో కొరటాల శివ ఒకరు. ఈ డైరెక్ట‌ర్ ఇప్పుడు నిర్మాత‌గా మారుతున్నారని ప్రచారం మొదలయ్యింది. అది కూడా ఏకంగా మ‌హేష్ బాబు సినిమాకి అట. సినీ సర్కిల్స్ లో సర్క్యులేట్ అవుతున్న స‌మాచారం ప్ర‌కారం మ‌హేష్‌, గీత గోవిందం డైరెక్టర్ ప‌రుశురామ్ కాంబినేష‌న్‌లో ఓ సినిమా రూపొందనుంది. మొదట ఈ సినిమాను గీతా ఆర్ట్స్ లో అల్లు అర‌వింద్ నిర్మిస్తార‌ని అంద‌రూ అనుకున్నారు. కానీ ఈ సినిమాను నిర్మించ‌డానికి ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ ఆస‌క్తిగా ఉన్నార‌ట‌. కొర‌టాల త‌న స్నేహితుడు గుంటూరు డిస్త్రిబ్యూటర్ మిక్కిలినేని సుధాక‌ర్‌తో క‌లిసి ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించే అవకాశాలున్నాయని సమాచారం. మరొ సమాచారం ప్రకారం పరశురామ్ సినిమా తరవాత కొరటాల శివతోనే కలిసి మహేశ్ బాబు సినిమా సెట్స్ మీదకు వెళ్లనుందని అంటున్నారు. ఈ ప్రచారంలో నిజం ఎంత ఉంది అనేది త్వరలోనే తేలనుంది.

More Related Stories