English   

హిప్పీ రిలీజ్ డేట్ లాకయింది...ఒక్కరోజు ముందు 

Hippi
2019-05-30 12:21:05

ఆర్‌ఎక్స్‌ 100 సినిమాతో ఓవర్ నైట్ వెలుగులోకి వచ్చిన కార్తికేయ నటిస్తున్న తాజా చిత్రం హిప్పీ.  కార్తికేయ హీరోగా టీఎన్ కృష్ణ దర్శకత్వంలో 'హిప్పీ' రూపొందింది. విభిన్నమైన కథాకథనాలతో నిర్మితమైన ఈ సినిమాలో కార్తికేయ సరసన నాయికగా దిగాంగన నటించింది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది. ముందు జూన్‌ 7న హిప్పీ రిలీజ్ చేయాలని అనుకున్నా చివరి నిముషంలో జూన్ 6వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలని ముహూర్తాన్ని ఖాయం చేసుకున్నారు. గతేడాది జూన్ 7న విడుదలైన 'ఆర్‌ఎక్స్‌ 100' అనూహ్యంగా సెన్సేషనల్‌ విజయం అందుకుంది. మళ్లీ అలాంటి కంటెంట్ తోనే ఆ డేట్ కి ఒక రోజు ముందు ఈ సినిమా రిలీజ్ అవుతోంది. ఈ సినిమాలో దిగంగనా సూర్యవంశీ హీరోయిన్‌గా నటిస్తోంది. సీనియర్‌ నటుడు జె.డి.చక్రవర్తి ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమాని వి క్రియేషన్స్ బ్యానర్ పై కలైపులి ఎస్ థాను నిర్మిస్తున్నాడు.  
 

More Related Stories