English   

దొరసాని ఫస్ట్ లుక్....విజయ్ తమ్ముడు...రాజశేఖర్ కూతురు 

Dorasani
2019-05-30 13:45:11

టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ తెరంగేట్రం చేస్తున్న సినిమా దొరసాని. కె.వి.ఆర్. మహేంద్ర దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమా ద్వారా రాజశేఖర్ చిన్న కుమార్తె శివాత్మిక కూడా పరిచయం అవుతోంది.  సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో మధుర ఎంటర్‌టైన్మెంట్స్, బిగ్ బెన్ సినిమాస్ పతాకాలపై మధుర శ్రీధర్‌రెడ్డి, యష్ గంగినేని నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను కొద్ది సేపటి క్రితం విడుదల చేశారు. యధార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు గతంలోనే క్లారిటీ ఇవ్వగా ఈరోజు మరింత స్పష్టత వచ్చినట్టు అయ్యింది. పేద అబ్బాయి పెద్దింటి అమ్మాయిని ప్రేమించడం అనే కాన్స్పేట్ తో చాలా సినిమాలు వచ్చాయి కానీ ఇందులో ప్రత్యేకంగా తెలంగాణ బ్యాక్ డ్రాప్ ని ఎంచుకోవడమే ఈ సినిమా ప్రత్యేకత. ఇక పోస్టర్ విషయానికి వస్తే శివాత్మిక మొదటి పోస్టర్ లో చక్కటి ఎక్స్ ప్రెషన్స్ చూపిస్తోంది. ఇక ఆనంద్ దేవరకొండ కారులో కూర్చున్న దొరసానిని ఓరకంట చూస్తూ వెంటపడుతున్న ఈ పోస్టర్ అంచనాలను పెంచుతోంది. చూడాలి మరి ఈ సినిమా ఏమి చేయనుందో ? 

More Related Stories