English   

రెండో షెడ్యూల్ కి రెడీ అవుతున్న బన్నీ 

 Allu Arjun
2019-05-30 17:02:58

త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ కథానాయకుడిగా ఒక సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ మధ్యనే మొదలయిన ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఎండల దెబ్బతో బ్రేక్ పడింది. జరిగిన ఈ షూట్ లో అల్లు అర్జున్ కి సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఖాళీగా ఉన్న అల్లు అర్జున్ ఫ్యామిలీతో కలిసి టూర్ కి వెళ్ళాడు. ఇక త్వరలో ఈ సినిమా రెండో షెడ్యూలు జూన్ 4న ప్రారంభం కానుందని సమాచారం. ఇక ఈ షెడ్యూల్ లో కీలక రోల్ చేస్తున్న సీనియర్ హీరోయిన్ టబు కూడా జాయిన్ కానున్నారని సమాచారం. దాదాపు 30 రోజులు నిరవధికంగా షూట్ చేయడానికి యూనిట్ సన్నాహాలు చేస్తోందని సమాచారం. ఈ మూవీలో అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా, సెకండ్ హీరోయిన్ గా కొత్త అమ్మాయి కెతికా శర్మ నటిస్తోంది. హారికా హాసినీ-గీతా ఆర్ట్స్ బ్యానర్స్ మీద రాధాకృష్ణ, అల్లు అరవింద్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా మీదే ఆశలు పెట్టుకున్నాడు అల్లు అర్జున్. మరి ఏమేరకు ఈ సినిమా హిట్ అవుతుంది అనేది వేచి చూడాలి మరి.

More Related Stories