English   

గేమ్ ఓవర్ ట్రైలర్ రివ్యూ...ఫుల్ సస్పెన్స్ 

Game Over
2019-05-30 17:49:05

దర్శకేంద్రుడు కే.రాఘవేంద్రరావు తెరకెక్కించిన ఝమ్మంది నాదం సినిమాతో హీరోయిన్‌గా కెరీర్ ప్రారంభించింది తాప్సీ. ఆ తర్వాత తెలుగులో చాలా సినిమాలు చేసినా ఏ సినిమా ఆమెకు పెద్దగా గుర్తింపును తీసుకరాలేదు. దీంతో బాలీవుడ్ కి షిఫ్ట్ అయిన తాప్సీ అక్కడ మాత్రం మంచి సినిమాలు చేస్తూ..నటనకు ప్రాధాన్యమున్న పాత్రల్నీ ఎంచుకుంటోంది తాప్సీ. అలా ఆమె నటించన సినిమాలే పింక్,ఈ మధ్య వచ్చిన 'ముల్క్','బద్లా' సినిమాలు. ఒక్కో సినిమాతో ఒక్కో వైవిధ్యమైన పాత్ర ఎంచుకుంటూ తన క్రేజ్ ను పెంచుకుంటూ వెళుతోంది. ఈ నేపథ్యంలోనే ఆమె హిందీలో 'గేమ్ ఓవర్' అనే హారర్ థ్రిల్లర్ సినిమా చేసింది. అశ్విన్ శరవణన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా నుంచి తాజాగా ఒక ట్రైలర్ ను రిలీజ్ చేశారు. తెలుగు ట్రైలర్ దగ్గుబాటి రానా చేతుల మీదుగా విడుదలైంది. తాప్సీ ఈ మూవీలో గేమ్ డిజైనర్‌గా నటించింది. తాప్సీ ఏదో నీడను చూసి భయపడడం, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని ప్రజలు.. చీకటి పడితే చాలు భయంతో వణికి పోతున్నారు. తలలు నరికి ఆనవాళ్లు చిక్కకుండా శరీరాలను తగులబెట్టి, అతి దారుణంగా యువతులను హత్య చేస్తున్నారు.. అంటూ న్యూస్ రావడం, తాప్సీని ఎవరో చంపబోవడం ఇలా అంత్జా సస్పెన్స్ తో కూడుకుని ఉంది ట్రైలర్. ఈ ట్రైలర్ సినిమా మీద అంచనాలను పెంచేట్టుగా ఉంది. ఈ సినిమాని హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో కూడా జూన్ 14వ తేదీన రిలీజ్ చేస్తున్నారు.  

More Related Stories