English   

మహేష్ బాబు దానికే ఫిక్స్ అయ్యాడట ?

 Mahesh Babu
2019-05-30 18:45:38

మహేష్ బాబు 26వ సినిమాకి సంబంధించిన లాంచింగ్ ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించనున్న ఈ సినిమా రేపు పూజా కార్యక్రమాలు జరుపుకోనుందని సమాచారం. ఇక వరుస విజయాలను అందుకుని టాలీవుడ్‌లో తనకంటూ మంచి క్రేజ్‌ను సంపాదించుకుంది రష్మికా మందన ఈ సినిమాలో హీరోయిన్ గా నటించానునదని సమాచారం. ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు కూడా వెళ్లనుంది. ఇటీవలే ‘ఎఫ్ 2’తో భారీ హిట్‌ను కొట్టిన అనిల్ మహేష్‌తో ఏ రేంజ్ హిట్ కొడతాడో చూడాలి. ఇక ఈ సినిమాలో ఒక్కప్పటి లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఓ కీలక పాత్రలో నటిస్తోంది. అలాగే రమ్యకృష్ణ కూడా ఓ ముఖ్య పాత్రలో నటించనుందని సమాచారం. ఇక ఈ సినిమాకి 'సరిలేరు నీ కెవ్వరూ' అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు చెబుతున్నారు. 'రెడ్డిగారి అబ్బాయి' అనే టైటిల్ అనుకున్నా మహేష్ బాబు దానికి పెద్దగా మొగ్గుచూపలేదని అందుకే సారి లేరు నీకెవ్వరూ అనే టైటిల్ నే రిజిస్టర్ చేయించారని అంటున్నారు. దిల్ రాజు అనిల్ సుంకర సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాను 6 నెలల్లో పూర్తిచేసి, సంక్రాంతికి విడుదల చేయాలనే ఆలోచనలో వున్నట్టుగా తెలుస్తోంది. 

More Related Stories