English   

సుమంత్ కొత్త సినిమా ప్రకటించేశాడు ?

sumanth
2019-05-30 19:56:00

రామ్ గోపాల్ వర్మ ‘ప్రేమకథ’ చిత్రంతో తెరంగేట్రం చేసిన అక్కినేని నాగార్జున మేనల్లుడు సుమంత్‌కు సత్యం సినిమాతో పేరు వచ్చింది. అయినా ఆ తరువాత పెద్దగా పేరు సంపాదించ లేకపోయాడు. గతేడాది మళ్ళీ రావా, సుబ్రమణ్యపురం, ఇదం జగత్ లాంటి సినిమాలతో వచ్చిన సుమంత్ పెద్దగా మళ్ళీ రావా మినహా మరే సినిమాతో ఆకట్టుకోలేకపోయారు. అయితే, ఈ ఏడాది ఎన్టీఆర్ బయోపిక్‌ లో తన తాతయ్య అక్కినేని నాగేశ్వరరావు పాత్రలో నటించిన ఆయన ఫరవాలేదని పించాడు. ఇక తాజాగా సుమంత్ హీరోగా తన కొత్త సినిమాను ప్రకటించాడు. సంతోష్ కుమార్ దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమాలో ఆయన ఒక యాక్షన్ ఫిలిం లో నటించనున్నాడు. సుమంత్ సరసన సిమ్రత్ హీరోయిన్‌ గా నటించనున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో ప్రకటిస్తారట.

 

More Related Stories