English   

శౌర్య- క్రిష్ -రాఘవేంద్రరావు క్రేజీ కాంబినేషన్

krish
2019-05-30 21:05:13

అలనాటి స్టార్ హీరోల నుండి నేటి కుర్ర హీరోల దాకా అనేక బ్లాక్ బస్టర్ మూవీస్ అందించిన సక్సెస్ ఫుల్ దర్శకుడు రాఘవేంద్ర రావు ఒక విభిన్నకథా చిత్రాన్ని రూపొందించనున్న విషయం తెలిసిందే. ఆ సినిమాకి ముగ్గురు దర్శకులు, ఒక హీరో, ముగ్గురు హీరోయిన్స్ ఉండనున్నారని మొన్న రిలీజ్ చేసిన పోస్టర్ లోనే క్లారిటీ వచ్చింది. లేడీ ఓరిఎంటెడ్ సినిమా అయిన దీనిలో ఒక్కో హీరోయిన్ కి ఒక్కో కథ ఉంటుందట, రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణ లో ముగ్గురు దర్శకులు ఆ మూడు కథలను తెరకెక్కిస్తారట, ఇప్పటికే ఈ ముగ్గురు దర్శకుల్లో ఒక దర్శకుడిగా తన శిష్యుడు క్రిష్ ను .. హీరోగా నాగశౌర్యను ఎంపిక చేసుకున్నారని, మరో ఇద్దరు దర్శకులు, అలాగే హీరోయిన్స్ ని ఫైనలైజ్ చేయాల్సి ఉంటుందని అంటున్నారు. ఈ మూడు కథల్లోను కామన్ పాయింట్ హీరో అట అదేనండీ శౌర్య అన్నమాట. వింటుంటేనే ఆసక్తి రేకెత్తిస్తోన్న ఈ ప్రాజెక్టు ఎన్ని సంచలనాలకి కారణం కానుందో చూడాలి మరి.

 

More Related Stories