English   

సాహో రిలీజ్ కన్ఫ్యూజన్...క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్

saaho
2019-05-30 22:06:36

బాహుబలి సిరీస్ తో ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయ్యాడు ప్రభాస్. ఆయన హీరోగా నటిస్తున్న తాజా మూవీ సాహో. గతంలో శర్వానంద్ తో రన్ రాజా రన్ సినిమా తెరకెక్కించిన సుజీత్ ఈ సినిమాని తెరకేక్కిస్తున్నాడు. తెలుగు సినిమాని కూడా హాలీవుడ్ రేంజ్ లో తెరకేక్కిస్తున్నారు. ప్రభాస్ మార్కెట్ దృష్ట్యా ఈ సినిమా తెలుగు, తమిళ, మలయాళ, హిందీ బాషలలో ఒకేసారి రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాషూట్ కూడా దాదాపు చివరి స్టేజ్ కి చేరుకుంది. బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాను, ఆగస్టు 15వ తేదీన విడుదల చేయనున్నారని ప్రకటించారు కూడా. అయితే ఈ సినిమాకి సంగీత దర్శకులుగా పనిచేస్తోన్న శంకర్ ఎహసాన్ లాయ్, రీసెంట్ గా ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్న నేపధ్యంలో ఈ సినిమా అనుకున్న సమయానికి విడుదల కాకపోవచ్చనే ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై తాజాగా స్పందించిన ఈ సినిమా డైరెక్టర్ సుజిత్ ముందుగా చెప్పినట్టుగానే ఆగస్టు 15వ తేదీన ఈ సినిమాను విడుదల అవుతుందని ఇందులో ఎలాంటి అనుమానాలు లేవని, విడుదల విషయంలో వస్తోన్న ఎలాంటి పుకార్లను నమ్మవద్దని, మ్యూజిక్ కూడా సిద్దమయు అనుకున్న సమయానికే ఈ సినిమా రిలీజ్ అవుతుందని ఆయన పేర్కొన్నారు.

More Related Stories