English   

సరిలేరు నీకేవ్వరూ అంటున్న సూపర్ స్టార్ కృష్ణ 

Sarileru Neekevvaru
2019-05-31 11:58:16

మ‌హ‌ర్షి చిత్ర విజ‌యంతో మంచి జోష్‌మీదున్న మ‌హేష్ బాబు త‌న 26వ చిత్రాన్ని అనీల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. దిల్ రాజు, అనీల్ సుంక‌ర‌ కలిసి నిరించానున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. కొద్ది రోజులుగా చిత్రానికి సంబంధించి వ‌స్తున్న వార్త‌లు అభిమానుల‌లో ఆనందాన్ని క‌లుగజేస్తున్నాయి. ఈ చిత్రానికి ‘సరిలేరు నీకెవ్వరూ’ , రెడ్డిగారి అబ్బాయి అనే టైటిల్స్‌లోఒక‌టి ఫిక్స్ చేస్తార‌ని ఇటీవ‌ల వార్త‌లు వ‌చ్చాయి. కృష్ణ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా చిత్ర టైటిల్ రివీల్ చేసింది చిత్ర బృందం. ‘సరిలేరు నీకెవ్వరూ’ అనే టైటిల్‌ని మూవీకి ఫిక్స్ చేస్తూ నిన్న రాత్రి పన్నెండు గంటలకు టైటిల్ లోగో విడుద‌ల చేసింది. ఇక ఈ రోజు ఉద‌యం 9:18ని.ల‌కి చిత్రాన్ని లాంచ్ చేయ‌నున్నట్టు ఆ ప్రకటన లోనే రివీల్ చేశారు.  సూపర్ స్టార్ మహేశ్ బాబు తదుపరి చిత్ర టైటిల్‌ను ప్రకటించడానికి ఇంత కంటే గొప్ప సందర్భం ఏముంటుందని ఆయన కృష్ణ గారి నోటి నుంచి టైటిల్ ఏంటో వినండంటూ దిరేక్తర్ అనిల్ రావి పూడి ట్వీట్ చేశారు. కృష్ణ మాటల ప్రకారం సరిలేరు నీకెవ్వరూ చిత్రం మహేశ్ బాబుకు 26వ సినిమా కానుంది. ఈ చిత్రం 2020 సంక్రాంతి బరిలో నిలుస్తుందని కృష్ణ తెలిపారు. సిల్వర్ జూబ్లీ పూర్తి చేసిన సూపర్ స్టార్.. గోల్డెన్ ఎరా మొదలవుతోందని ఈ వీడియోలో పేర్కొన్నారు.  

More Related Stories