English   

మోడీ ప్రమాణం...రాలేకపోయిన కాజల్ 

Kajal Aggarwal
2019-05-31 12:09:25

భారతదేశ ప్రధానిగా నరేంద్రమోదీ రెండో సారి బాధ్యతలు చేపట్టారు. నిన్న సాయంత్రం 7గంటలకు ఆయన ప్రధానిగా ప్రమాణస్వీకారం చేశారు. ఒంటిచేత్తో రెండోసారి బీజేపీకి సంపూర్ణ మెజారిటీ సాధించిన మోదీతో గురువారం రాత్రి ఏడు గంటలకు రాష్ట్రపతిభవన్ ప్రాంగణంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రమాణం చేయించారు. పలు దేశాల అధినేతలు, 8000 మంది అతిథులు, కార్పొరేట్ అతిరథ మహారథులు, సినీ ప్రముఖుల తళుకుబెళుకుల మధ్య అత్యంత సందడిగా కేంద్ర క్యాబినెట్ ప్రమాణ స్వీకారం జరిగింది. ఇక సినిమా రంగం నుండి కంగనా రనౌత్‌, షాహిద్ కపూర్, రజనీకాంత్, దర్శకనిర్మాత కరణ్ జోహార్ తదితరులు హాజరయ్యారు. ఇక ఈ కార్యక్రమానికి హాజరుకావాలని నటి కాజల్ అగర్వాల్‌కు కూడా ఆహ్వానం అందింది. అయితే ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరు కాలేకపోతున్నానని కాజల్‌ తెలిపింది. తనను ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆహ్వానించినందుకు ధన్యవాదాలు అని ఈ ఆహ్వానం వచ్చినందుకు గొప్ప గౌరవంగా భావిస్తున్నానని కానీ ఢిల్లీకి సరైన సమయంలో చేరుకోలేని పరిస్థితి. ఈ వేడుకకు రాలేకపోతున్నందుకు బాధగా ఉందని ఆమె ట్వీట్ చేసింది. 

More Related Stories