English   

సూర్య కటౌట్ కూల్చివేసిన మునిసిపాలిటీ అధికారులు...ఫ్యాన్స్ ఆగ్రహం

Suriya
2019-05-31 12:58:03

తెలుగు, త‌మిళంలో స్టార్ హోదా అనుభవిస్తున్న సూర్య‌ న‌టించిన తాజా చిత్రం ఎన్‌జీకే. ఈరోజు ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల అవుతున్న ఈ సినిమా రిలీజ్‌కి ముందే పలు రికార్డులు క్రియేట్ చేస్తుంది. సౌత్ కొరియాలో తొలిసారిగా విడుద‌ల అవుతున్న్ తమిళ చిత్రం ఇదే. ఇక ఈ సినిమా థియేట‌ర్స్ ద‌గ్గ‌ర సూర్య అభిమానులు రచ్చ చేస్తున్నారు. తమిళ ప్రేక్షకుల అభిమానం మనకి తెలియనింది కాదు రజనీ, అజిత్, విజయ్ సినిమాలకు మాదిరిగానే డప్పులు, పాలాభిషేకాల‌తో త‌మ ఆరాధ్య న‌టుడిపై ప్రేమ‌ని చాటుకుంటూ ఈ సారి ఏకంగా తిరుత్తణి- చెన్నై బైపాస్‌ రోడ్డులో 215 అడుగుల సూర్య క‌టౌట్ ఏర్పాటు చేశారు. తమిళనాడు తిరువళ్లూరు జిల్లాకి చెందిన సూర్య ఫ్యాన్స్ ఈ కటౌట్ కోసం సుమారు రూ.7 లక్షలు ఖర్చు పెట్టగా 35 రోజుల పాటు, సుమారు 40మంది కార్మికులు కష్టపడి ఈ కటౌట్‌ని ఏర్పాటు చేసిన‌ట్టు తెలుస్తుంది. గ‌తంలో అజిత్‌ ఫ్యాన్స్‌ ఏర్పాటు చేసిన 180 అడుగుల కటౌట్‌ దేశంలోనే అతిపెద్దదిగా రికార్డు న‌మోదు చేయ‌గా, ఇప్పుడు సూర్య కటౌట్ దానిని బ్రేక్ చేసింది. అయితే ఆ కటౌట్‌ని తొలగించమని కోర్ట్ ఆర్డర్ చేసింది. బతికున్న వారి విగ్రహాలు, కటౌట్‌లు పెట్టకూడదు, వెంటనే సూర్య కటౌట్‌ను అక్కడినుండి తొలగించాలని మద్రాసు హైకోర్ట్ తీర్పునిచ్చింది. విజయ్ కత్తి, అజిత్ విశ్వాసం సినిమాల విడుదలప్పుడు, అభిమానులు కటౌట్‌లకు పాలాభిషేకాలు చేస్తూ, ప్రమాద వశాత్తు కిందపడి మరణించారు. వీటన్నిటినీ పరిగణలోకి తీసుకున్న కోర్ట్, ఎన్‌జీకే కటౌట్‌ని తొలగించమని చెప్పడంతో దానిని చెన్నై మునిసిపాలిటీ అధికార్లు తొలగించారు. దీంతో సూర్య అభిమానులు  తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. వేరే హీరోల అభిమానులు ఏర్పాటు చేసినప్పుడు లేనిది ఇప్పుడు ఎందుకు ఇలా తొలగిస్తున్నారని వారు ప్రశ్నిస్తున్నారు.

More Related Stories