English   

హాలీవుడ్ ఛాన్స్ కొట్టేసిన రజనీ హీరోయిన్ 

Huma Qureshi
2019-05-31 14:13:58

ఇటీవలే కేన్స్‌ అంతర్జాతీయ చలన చిత్రోత్సవానికి బాలీవుడ్‌ నుంచి వెళ్లి అక్కడి ఎర్రతివాచీపై సందడి చేసిన హ్యూమా ఖురేషీకి ఇప్పుడు హాలీవుడ్‌ లో నటించే అవకాశం దక్కింది.  సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ న‌టించిన కాలా చిత్రంలో క‌థానాయిక‌గా న‌టించిన ఆమె తెలుగు ప్రేక్షకులకి కూడా సుపరిచితమే. హాలీవుడ్ దర్శకుడు జాక్ స్నిడ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న జాంబిక్ థ్రిల్ల‌ర్ ఆర్మీ ఆఫ్ ది డెడ్ అనే చిత్రంలో హ్యుమా ఖురేషీ కీలక పాత్ర పోషించ‌నుంద‌ని అని ప్ర‌ముఖ ట్రేడ్ ఎన‌లిస్ట్ త‌ర‌ణ్ ఆద‌ర్శ్ ట్విట్ట‌ర్ ద్వారా ప్రకటించారు. డేవ్ బౌటిస్టా చిత్రంలో ప్ర‌ధాన పాత్ర పోషిస్తుండ‌గా, ఇందులో చాలా మంది స్టార్స్ నటిస్తున్నారు. ఇక దర్శకుడి గురించి చెప్పాలంటే ఆయన 300, మ్యాన్ ఆఫ్ స్టీల్‌, బ్యాట్ మాన్ వెర్స‌స్ సూప‌ర్‌మేన్ వంటి భారీ హిట్ సినిమాలని తెర‌కెక్కించారు. తాజా చిత్రాన్ని కూడా భారీ బ‌డ్జెట్‌తో రూపొందించ‌నున్న‌ట్టు స‌మాచారం. ప్రియాంక‌, దీపిక మాదిరిగా హ్యుమా కూడా హాలీవుడ్‌లో ఏమైనా ఖాతా పెడుతుందేమో చూడాలి. ఈ చిత్రం జులైలో సెట్స్‌కు వెళ్తుందని అంటున్నారు. 

More Related Stories