English   

సాహో నుండి రంజాన్ సర్ప్రైజ్ 

Saaho
2019-05-31 17:04:09

తెలుగులో మోస్ట్ అవేయిటేడ్ మూవీ ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా సాహో అని చెప్పక తప్పదు. యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ప్ర‌ధాన పాత్ర‌లో రన్ రాజా రన్‌ ఫేం సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని యూవీ క్రియేషన్స్ సంస్థ సుమారు రూ.300 కోట్లతో నిర్మిస్తోంది. ఇక ఈ సినిమా ఈ ఆగ‌స్ట్ 15న విడుద‌ల చేయడానికి ప్లాన్ చేస్తుండగా ఈ సినిమాకి సంబంధించిన ప్ర‌మోష‌న్స్ కూడా స్పీడ్ పెంచారు. ఇప్పటికే ఈ సినిమా నుండి చాప్టర్ 1, చాప్టర్ 2 అంటూ మేకింగ్ వీడియోస్ రిలీజ్ చేయగా, తాజా రెండు పోస్ట‌ర్స్ విడుద‌ల చేశారు, అయితే రంజాన్ సందర్భంగా జూన్‌ 5న సాహో నుండి కొత్త టీజర్‌ని విడుద‌ల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేసినట్టు స‌మాచారం. ఇప్పటికే సాహో సంబంధించి చాప్ట‌ర్ 1, చాప్ట‌ర్ 2 పేరుతో విడుద‌లైన వీడియోల‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు ఈ టీజర్ ఇంకేం మాజిక్ చేయనుందో వేచి చూడాలి. ఈ సినిమాలో ఇవ్లిన్‌ శర్మ కీలక పాత్రలో నటిస్తుండగా నీల్ నితిన్ ముఖేశ్, వెన్నెల కిశోర్ , మురళీ శర్మ, జాకీష్రాఫ్, మందిరా బేడీ, అరుణ్ విజయ్ లు కూడా నటిస్తున్నారు. 

More Related Stories