English   

ఎన్జీకే మూవీ రివ్యూ 

NGK
2019-05-31 19:08:53

తమిళ్ స్టార్ హీరో సూర్య గజినీ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. ఆనాటి నుండే సూర్య సినిమాలు వస్తున్నాయంటే తమిళ్ వాళ్లతో పటు తెలుగు ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తారు. ఇక సింగం సిరీస్ లో సూర్య పోలీస్ పాత్రలో ఇమిడిన విధానం చూసి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అలా తాజాగా సూర్య 7/జి బృందావన్ కాలనీ డైరెక్టర్ సెల్వ రాఘవన్ దర్శకత్వంలో రకుల్ ప్రీత్ సింగ్, సాయి పల్లవిలతో కలిసి ఎన్జీకే సినిమా చేసాడు. మరి ఈ సినిమా ఎలా ఉంది అనేది రివ్యూలో చూద్దాం.

కధ :

వ్యవసాయ శాస్త్రంలో పీహెచ్డీ చేసిన ఎన్జీకే(సూర్య) అనబడే నందగోపాలకృష్ణ వ్యవసాయం మీద మక్కువతో జాబ్ మానేసి సొంత ఊరొచ్చి ఆర్గానిక్ ఫామింగ్ మొదలు పెడతాడు.మనోడిని చూసి మరికొంత మంది యువకులు కూడా అతన్ని ఫాలో అవుతారు. దీంతో ఎరువులు కొనేవారు లేక ఎరువుల కొట్ల వాళ్ళు, అలాగే ఎరువుల కోసం అప్పులు తీసుకోడం లేదని వడ్డీ వ్యాపారం వాళ్ళు ఎన్జీకేని భయపెడతారు. అయితే వాళ్ళని తాను ఏమీ చేయలేనని తెలుసుకున్న ఎన్జీకే రాజకీయ నాయకుడిని అయితే జనం, రౌడీలు ఒక్కరేమిటి అందరూ నెత్తిన మోస్తారు అని రాజకీయంలోకి అడుగు పెడతాడు. రాజకీయాల్లో చక్రం తిప్పి జనాల సమస్యలను పోగొట్టాలని చూస్తాడు. మరి అతని ప్రయత్నం ఫలించిందా లేదా ? ఇక ఈ శాయి పల్లవి, రకుల్ తో మనోడికి సంబంధం ఏమిటి అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే, 

విశ్లేషణ :

ఓ సాధారణ యువకుడు సీఎంగా ఎలా మారాడు అనే కాన్సెప్ట్ తో ఈ సినిమా రాసుకున్నాడు దర్శకుడు సెల్వరాఘవన్. సాధారణ కార్యకర్తగా జీవితాన్ని మొదలుపెట్టిన గోపాలం తన తెలివితేటలు, కుయుక్తులతో ప్రజాభిమానాన్ని సంపాదించి ఎలా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించాడో సినిమాటిక్ గా ఆవిష్కరించాలని అనుకున్నారు. కానీ తాను చెప్పాలనుకున్న పాయింట్‌ను స్పష్టంగా, సూటిగా చెప్పడంలో తడబడిపోవడంతో సినిమా మొత్తం చుక్కాని లేని నావలా సాగింది. అక్కడక్కడా తేజ నేనే రాజు నేనే మంత్రి ఛాయలు కూడా కనిపించాయి. నటీనటుల విషయానికి వస్తే సూర్య నటన విషయాలో కూడా అక్కడక్కడా ఇబ్బంది అనిపించింది అంటే నమ్మరు. ఒక నటుడిగా అసలు ఈ కధ ఎలా ఒప్పుకున్నాడు అనే అనుమానం తప్పక కలుగుతుంది. ఇక సూర్య భార్యగా నటించిన సాయిపల్లవి కనిపించింది కొన్ని సీనల్లో అయినా రెచ్చిపోయి నట విశ్వరూపం చూపింది. ఇక పొలిటికల్ పి.ఆర్ గా కనిపించిన రకుల్ ప్రీత్ సింగ్‌కి యాక్టింగ్‌లో పెద్దగా స్కోప్ దక్కలేదు. మిగిలిన నటీనటులు బానే చేశారు. టెక్నీషియన్స్ విషయానికొస్తే మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్ రాజా ఒక్క ట్యూన్ కూడా మంచిది ఇవ్వలేకపోయాడు. ఆర్.ఆర్ పరంగా మాత్రం ఓకే అనిపించాడు. కెమెరామెన్ పనితనం కొన్ని సీన్స్‌లో కనిపిస్తుంది. 

ఫైనల్ గా : గతి తప్పిన స్క్రీన్ ప్లే ఫలితమే ఈ ఎన్జీకే. 

రేటింగ్ : 2 / 5

More Related Stories