English   

నాన్న సినిమాతో ఎంట్రీ కొడుకు సినిమాతో రీ ఎంట్రీ

vijayshanthi
2019-05-31 19:43:33

తెలుగు ప్రేక్షకులతో లేడీ సూపర్ స్టార్‌ గా పిలుపించుకున్న విజయశాంతి రాజకీయాల్లోకి వెళ్ళాక  సినిమాలకు దూరమైపోయారు. నాయుడమ్మ సినిమాలో దాదాపు పదిహేనేళ్ళ క్రితం ఆమె చివరిగా కనిపించారు. ఆ తరవాత మరే సినిమాను ఆమె అంగీకరించలేదు. అయితే, 13 ఏళ్ల విరామం తరవాత విజయశాంతి మళ్లీ మేకప్ వేసుకోబోతున్నారు. మహేష్ బాబు, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కబోతోన్న ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో విజయశాంతి రీఎంట్రీ ఇస్తున్నారు. ఈ విషయాన్ని దర్శకుడు అనిల్ రావిపూడి ఈరోజు స్వయంగా ప్రకటించారు కూడా. ఇదే విషయాన్ని విజయశాంతి కూడా ట్విట్టర్ దారా మరోసారి ప్రకటించింది. తాను తెలుగులో నటించిన తొలి చిత్రం కిలాడీ కృష్ణుడు అని, సూపర్ స్టార్ కృష్ణ సరసన నటించిన ఆ చిత్రం తనకు ఎప్పటికీ ప్రత్యేకమేనని ఆ సినిమా వలన తెలుగు, తమిళ, మలయాళీ, కన్నడ భాషల్లో 180కి పైగా చిత్రాల్లో నటించానని అక్కడి నుండి బాలీవుడ్ కి వెళ్లి అక్కడ కూడా నటించానని  ఇక మహేష్ బాబుగారి సినిమాతో 2020లో మరోసారి నటిగా మీ ముందుకు వస్తున్నా. మరోసారి నేను సినిమాల్లో నటించాలనేది దైవ సంకల్పమో, ప్రజల దీవేనో కానీ ఏది ఏమైనానా కర్తవ్యాన్ని బాధ్యతతో నిర్వహించడమే తెలిసిన మీ రాములమ్మగా మీ ముందుకు వస్తున్నానని విజయశాంతి కాస్త సినిమాటిక్ టచ్ ఇస్తూ ట్విట్టర్ లో ట్వీట్ చేసింది. 

More Related Stories