English   

కార్తికేయ మ్యాజిక్ మళ్ళీ పని చేస్తుందా ?

kart
2019-05-31 20:24:18


నిఖిల్, కలర్స్ స్వాతి లీడ్స్ గా చందు మొండేటి దర్శకత్వంలో రూపొందిన 'కార్తికేయ' ఐదేళ్ళ క్రితం రిలీజ్ అయ్యి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక ఈ హిట్ సినిమాకి సీక్వెల్‌గా ‘కార్తికేయ-2’ సినిమాని ప్లాన్ చేశారు. నిఖిల్ హీరోగా, చందు మొండేటి దర్శకత్వంలో 'కార్తికేయ-2' పేరుతో రూపొందనున్నట్టు ఈరోజు మీడియాకి ప్రెస్ మీట్ రిలీజ్ చేశారు మేకర్స్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్స్ మీద నిర్మాతలు టి.జి.విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మిస్తున్నారని సమాచారం. ఇక ఈ విషయాన్ని నిఖిల్ పుట్టినరోజు సందర్భంగా జూన్ 1 అధికారికంగా వెల్లడించనున్నారు. దర్శకుడు చందు మొండేటి తాజాగా తెరక్కేక్కించిన సినిమా సవ్యసాచి పెద్ద దెబ్బే వేసింది. ఇక నిఖిల్ అర్జు సురవరం ఇంకా రిలీజ్ కి కూడా నోచుకోకుండా తిప్పిస్తోంది. కార్తికేయ సోపర్ హిట్ కావడంతో కార్తికేయ-2 మీద కూడా అంచనాలు గట్టిగానే ఉంటాయని ఆ అంచనాలను తగ్గట్టుగానే రెండో పార్ట్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం. కార్తికేయకు ఈ సినిమా కొనసాగింపుగా ఉంటూనే సరికొత్త కధనంతో ఉంటుందట. 

More Related Stories