English   

ఎక్కడికి వెళ్లినా తోడు తీసుకు వెళుతోందట !

  Parineeti Chopra
2019-06-01 09:07:07

ప్రస్తుతం వరుస అవకాశాలతో దూసుకుపోతోంది బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా. నిజానికి తెలుగులో మోస్ట్ డిజైరబుల్ మూవీగా తెరకెక్కుతున్న ఆర్ ఆర్ ఆర్ లో కూడా ఆమెను నటింప చేయాలని ప్రయత్నించినా ఆమె బిజీ షెడ్యూల్ వలన అది కుదరలేదు. ఇక ఆమె ఆ మధ్య బ్యాడ్మింట‌న్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ బయోపిక్ కి ఒప్పుకుంది. అయితే ఆమె సినిమా సైన్  చేసినంత ఈజీ కాదని ఇప్పుడు అవగతం అవుతోందట. ఈ దెబ్బకు ఆమె ఇక్కడికి వెళ్లినా ఆమె వెంట ఒక సుశిక్షితుడైన బ్యాడ్మింటన్ కోచ్ ఆమె వెంటనే ఉండే లాగా ప్లాన్ చేస్తుందట. ఎక్కడికి వెళ్లినా అంటే ముంబై లో మాత్రమే అనుకునేరు అలా కాదు ఆమె  తన సినిమా రిలీజవుతునా, ఎక్కడైనా ప్రమోషన్స్ కి వెళ్లినా   లేదా షూటింగ్ కోసం విదేశాలకి వెళ్లినా సరే అక్కడికి ఈ అమ్మడు తన వెంట కోచ్ ని తీసుకెళుతోందట. అంటే దీనిని బట్టి ఆమె ఈ  పాత్ర మీద పెడుతున్న శ్రద్ద మీకు అర్థం అవుతుంది. నిజానికి సైనా నెహ్వాల్ బయోపిక్ ప్రకటన వచ్చి రెండేళ్లు అయింది. అప్పటి నుండి మేకర్స్ ప్రీ ప్రొడక్షన్ చేస్తూనే ఉన్నారు. నిజానికి ఈ బయోపిక్ గత ఏడాది ప్రారంభం కావాల్సినదే. కానీ అప్పటికే ఎంపిక చేసుకున్న శ్రద్ధా కపూర్ డేట్స్ ప్రాబ్లం వలన దర్శకనిర్మాతలకు విభేధాలొచ్చాయి.   దాంతో శ్రద్దని ఈ ప్రాజెక్టు నుంచి తప్పిస్తున్నామని నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ఆ సమయంలో ఈ ప్రాజెక్టుకు సంతకం చేసి ప‌రిణీతి ఎలా అయినా ఈ సినిమా ద్వారా మంచి పేరు తెచ్చుకోవాలని చూస్తోంది.అమోల్ గుప్తా దర్శకత్వంలో టీసిరీస్ భూషణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

More Related Stories