English   

నాని కూడా సంక్రాంతికే….అడ్డాల జోనర్ లో ?

 Nani
2019-06-01 09:19:39

కొత్తబంగారు లోకం సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. అయితే ఈ సినిమా మీద ఏర్పడిన నమ్మకంతో మహేష్ బాబు తో బ్రహ్మోత్సవం సినిమా చేయగా అది మహేష్ బాబు కెరీర్ లోనే అతి దారుణమైన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఇక ఆ సినిమా దెబ్బకు చాన్నాళ్ల పాటు ఆయన కథలు వినడానికే హీరోలు భయపడే పరిస్థితి నెలకొంది. ఈ మధ్య ఆయన కొత్త సినిమా గురించి వార్తలు వస్తున్నాయి. ఈ ఏడాది సంక్రాంతి సమయంలో ఆయన స్వగ్రామంలో ఆ ప్రకటన చేశారు. అయితే ఒక కకథ లైన్ లో ఉంది అని మాత్రమే ఆయన చెప్పడంతో ఆయన సినిమా మీద రకరకాల ప్రచారం జరుగుతోంది. అందుతున్న సమాచారం ప్రకారం తన ఫ్యామిలీ ఇమేజకి తగ్గట్టుగా ఒక ఎమోషనల్ లవ్ స్టోరీని రాసుకున్న శ్రీకాంత్ అడ్డాల దానికీ నానిని కూడా ఒప్పించాడట. సంక్రాంతి లోపు సినిమాను పూర్తి చేయాలని ప్లాన్ చేసినట్లు కూడా తెలుస్తోంది. ఈ ఏడాది నవంబర్ నాటికి సినిమా పూర్తి చేసి 2020 జనవరిలో సినిమాను రిలీజ్ చెయ్యాలని అనుకుంటున్నారట. ఇక ఈ సినిమా గీత ఆర్ట్స్ తెరకెక్కనుందని అంటున్నారు. ఐతే ఈ ప్రచారం ఎంతవరకు నిజమో తెలియదు కానీ త్వరలోనే ఈ సినిమాపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

More Related Stories