English   

సాహో కోసం ఆయన్ను ఫైనల్ చేసినట్టేనా ?

Saaho
2019-06-01 11:25:30

బాహుబలి స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ బ‌డ్జెట్‌ మూవీ సాహో. ప్రభాస్ సరసన శ్రద్ధా కపూర్ జంట‌గా నటిస్తోన్న ఈ సినిమా ఆగస్ట్ 15న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. అయితే ముందు ఈ సినిమాకి
శంకర్ ఎహసాన్ లాయ్ ను సంగీత దర్శకులుగా అనుకున్నారు. అయితే పేర్లు వీరివి ఉన్నా మరికొందరు సంగీత దర్శకుల చేత మ్యూజిక్ కంపోజ్ చేయించాలని మేకర్స్ భావించడంతో ఆ విషయంలో ఇబ్బంది పడిన ఆ త్రయం ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా వాళ్లు వెల్లడించారు. దాంతో ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా ఎవరిని తీసుకోనున్నారా అనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఈ విషయంలో మాత్రం ఒకే ఒక పేరు తెర మీదకు వచ్చింది. ఆఆయనే జిబ్రాన్, తెలుగులో ‘బాబు బంగారం’ వంటి తెలుగు సినిమాలు చేసిన జిబ్రాన్ కి, తమిళంలో ‘విశ్వరూపం 2’ వంటి భారీ సినిమాకి పనిచేసిన అనుభవం వుంది. ఇక సాహో కోసం ఆయన కొంత పని కూడా చేశారట. సాహో చాప్టర్ 1 లాంటి ప్రమోషనల్ వీడియోస్ కి ఆయన ఆర్ ఆర్ కొట్టాడట.  బహుశా అందుకే ఇలా వేరే వాళ్ళ చేత చేయించడం ఇష్టం లేకనే ఆ త్రయం తప్పుకున్నారు అని అంటున్నారు. ఏదైతేనేం అదే నిజం అయితే జిబ్రాన్ చేతికి భారీ సినిమా దక్కినట్టే.

More Related Stories