English   

మూడూ మూడాఫ్ చేశాయి !

Falaknuma Das
2019-06-01 11:52:25

ఈ ఏడాది మొదటి నుండి అంచనాలు ఉన్న సినిమాలు అన్నీ బాగానే ఆడాయి. అయితే అంతగా అంచననాలు లేకుండా రిలీజ్ అయిన సినిమాలు మాత్రం  ప్రేక్షకులను మాత్రం ఆకట్టుకోలేకపోతున్నాయి. ఇక ఈ వారం కూడా మూడు క్రేజీ సినిమాలు లు రిలీజ్ అయ్యాయి. అందులో ఒకటి తమిళ స్టార్ హీరో సూర్య నటించిన ఎన్జికే భారీ అంచనాల మధ్య విడుదల కాగా.. 'ఈ నగరానికి ఏమైంది' ఫేమ్ విశ్వక్ సేన్ నటించి డైరెక్ట్ చేసిన ఫలక్ నుమా దాస్ అనే తెలుగు చిత్రం కూడా విడుదల అయ్యింది. ఇక ప్రభుదేవా - తమన్నా జంటగా నటించిన అభినేత్రి 2 సైతం రిలీజ్ అయినా దానిని ఎవరూ పెద్దగా గుర్తించలేదు.  ఇక వీటి తో పాటు సువర్ణ సుందరి , ఇంగ్లీష్ డబ్బింగ్ గాడ్జిల్లా చిత్రాలు వచ్చాయి. కానీ ఈ సినిమాల్లో ఒక్క సినిమా కూడా  ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేక పోయాయి. ఇక ఎన్జీ కే లాంటి సినిమా సూర్య ఎలా తీశాడు రా బాబు అని ఆయన అభిమానులు తలలు పట్టుకుంున్నారు. చిన్న సినిమాగా సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ అండతో  వచ్చిన ఫలక్ నుమా దాస్ కూడా   ఏమంత బాలేదు.ఇక ప్రభుదేవా తమన్నాల అభినేత్రి 2 గురించి ఎక్కువ మాట్లాడుకోకపోవడం మంచిది. అసలెందుకు తీశారో అర్థం కాని విచిత్రమైన హారర్r కామెడీ తో ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టింది. అలా ఈ మూడు సినిమాలు నిరాశ పరచాయి అనే చెప్పాలి. 

More Related Stories