English   

రాక్షసుడు టీజర్ టాక్ 

Rakshasudu Teaser
2019-06-01 15:31:07

బెల్లంకొండ శ్రీనివాస్ కథానాయకుడిగా రమేశ్ వర్మ 'రాక్షసుడు' సినిమాను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ మీద అభిషేక్ నామా నిర్మిస్తోన్న ఈ సినిమాలో బెల్లంబాబు సరసన  అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది. తమిళ సినిమా రాచ్చాసన్ కి తెలుగు రీమేక్ గా తెరెక్కుతున్న ఈ సినిమాలో విలక్షణ నటుడు రాజీవ్ కనకాల కీలక పాత్రలో నటిస్తున్నాడు. క్రైమ్ థ్రిల్లర్ గా నిర్మితమవుతోన్న ఈ సినిమా నుంచి తాజాగా ఒక టీజర్ ను రిలీజ్ చేశారు. ఈ టీజర్ ను పరిశీలిస్తే గనుక స్కూల్ పిల్లలను కిడ్నాప్ చేసి .. వాళ్లపై అత్యాచారం చేసి హత్య చేసే ఒక సైకో, ఆ సైకోను పట్టుకోవడానికి పోలీస్ డిపార్ట్ మెంట్ చేసే ప్రయత్నాలను టీజర్ లో చూపించారు. ఆ రాక్షసుడిని పట్టుకునే పోలీస్ అధికారిగా బెల్లంకొండ శ్రీనివాస్ కనిపించనున్నాడు. సాహో సినిమాకి సంగీతం అందిస్తున్న గిబ్రాన్ ఈ సినిమాకి కూడా సంగీతాన్ని సమకూర్చారు. ఈ సినిమాను, జూలై 18వ తేదీన విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

More Related Stories