English   

మురళీ మోహన్ కి అస్వస్థత…చిరు పరామర్శ

Murali Mohan
2019-06-01 15:55:18

ప్రముఖ సీనియర్ నటుడు, రాజమండ్రి మాజీ ఎంపీ మురళీమోహన్ అస్వస్థతకు గురయ్యారన్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ మధ్యనే ఆయన తల్లి మరణించగా ఆమె అస్తికలు వారణాసిలో నిమజ్జనం చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో కుటుంబసభ్యులు ఆయన్ని హైదరాబాద్ లోని కేర్ ఆస్పత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు వెన్నముకకు శస్త్రచికిత్స చేయాలని సూచించారు. వైద్యుల సూచన మేరకు వెంటనే వెన్నముక శస్త్రచికిత్స చేయించుకున్న ఆయన వారం రోజులపాటు ఆస్పత్రిలోనే ఉన్నారు. నిన్న రాత్రి ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన మురళీమోహన్... ప్రస్తుతం తన నివాసంలో కోలుకుంటున్నారు. మురళీమోహన్ అనారోగ్య పరిస్థితి తెలుసుకున్న చిరంజీవి తన భార్య సురేఖతో కలసి మురళీమోహన్ ఇంటికి వెళ్లారు. ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

More Related Stories