English   

అమ్మాయిని మోసం చేసిన సినీ రచయిత 

  tollywood writer
2019-06-01 16:17:35

అతని పేరు రమణ, సినిమాల మీద పిచ్చితో హైదరాబాద్ వచ్చాడు. నెమ్మదిగా టీవీ సీరియల్స్ కి డైలాగ్స్ రాయడం మొదలు పెట్టి రచయిత గా మారాడు. బంజారా హిల్స్‌లోని ఎన్‌బీటీ నగర్‌లో నివసించే ఓ యువతి సినిమా అవకాశాల కోసం ప్రయత్నించే సమయంలో తో పరిచయం అయ్యింది. వీరిద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారింది. సినిమాలు వద్దని చెప్పడంతో సదరు యువతి ఆ ప్రయత్నాలు కూడా మానుకుంది. ఆ తర్వాత సోదరుడి తో కలిసి గల్ఫ్‌ వెళ్లింది. అక్కడ సంపాదించిన దాంట్లో రూ.2.5 లక్షలు ఖర్చుపెట్టి ప్రియుడికి ఉంగరం, వాచీ, ఐఫోన్‌ కొనిపెట్టింది. గల్ఫ్‌ నుంచి తిరిగి వచ్చాక ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. ఆ తర్వాత ఆమె సింగపూర్‌ వెళ్లి అక్కడ కొన్నాళ్లు పనిచేశాక బహరిన్‌ వెళ్లింది. అక్కడ  సంపాదించిన  రూ.5 లక్షలు గౌతమ్‌కు ఇచ్చింది. తిరిగి వచ్చాక ఇద్దరూ కలిసే ఉంటున్నారు. ఇటీవల సదరు యువతి పెళ్లి ప్రస్తావన తేవడంతో గౌతమ్‌ అడ్డం తిరిగాడు. దీంతో మనస్తాపం చెందిన ఆమె నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యా యత్నం చేసింది. ఈ ఘటన అనంతరం పోలీసులు గౌతమ్‌ను పిలిచి కౌన్సెలింగ్‌ నిర్వహించారు. పెళ్లికి అంగీకరించడంతో ఆదివారం హరే కృష్ణకృష్ణ దేవాలయంలో ఇద్దరికీ పెళ్లి చేశారు. వివాహం అనంతరం ఎన్‌బీటీ నగర్‌లోని యువతి ఇంటికి వెళ్లారు. ఆ రాత్రి సిగరెట్ కోసం బయటకు వెళ్లిన గౌతమ్‌ తిరిగి ఇంటికి రాలేదు. పలుమార్లు ఫోన్‌ చేయగా రెండురోజుల క్రితం స్పందించిన గౌతమ్‌ విడాకులు తీసుకుందామని కోరాడు. ఎంత చెప్పినా వినకపోవడంతో శుక్రవారం బాధితురాలు మళ్లీ పోలీసులను ఆశ్రయించింది. 

More Related Stories