English   

ఇట్స్ అఫిషియల్... హిరణ్య కశిప ! 

 Gunasekhar
2019-06-01 17:12:53

ప్రయోగాలు అంటే ముందుండే రానా మరో ప్రయోగానికి రెడీ అవుతున్నాడు. తమ సొంత నిర్మాణ సంస్థ అయిన సురేష్ ప్రొడక్షన్స్ లో ఒక భారీ పౌరాణిక చిత్రాన్ని తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. నిజానికి గుణ శేఖర్ దర్శకత్వంలో ఈ సినిమా ఉంటుందని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. దానికి క్లారిటీ ఇస్తూ దర్శకుడు గుణశేఖర్‌ ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన చేశారు. గత మూడేళ్లుగా హిరణ్యకశ్యప సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుగుతున్నట్టుగా తెలిపారు. ఈ సినిమాలో రానా టైటిల్‌ రోల్‌లో నటించనున్నారని తెలిపారు. మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు. ఇక రానా చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఒకపక్క విరాటపర్వం సినిమా ఒప్పుకొగా మరో పక్క హాతీ మీరే సాతీ అనే సినిమా కూడా చేస్తున్నాడు. 

More Related Stories