English   

కాజల్ మేకప్ లేకుండా...అదే అందమట ?

 Kajal Aggarwal
2019-06-01 17:50:21

సినిమాల్లో ముట్టుకుంటే మాసిపోయెలాగా కనిపిస్తారు నటీనటులు, మరీ ముఖ్యంగా హీరోయిన్లు. నిజానికి వారు అంతగా మెరిసిపోవాలంటే మేకప్ వాడతారు.  హీరోయిన్లు ఎవరూ మేకప్ లేకుండా బయటకిరారు.. వితౌట్ మేకప్ వాళ్ళ ఫోటోలు కూడా బయట పెట్టరు. మేకప్ లేకుండా ముఖం చూపించాలన్నా ఆ ఫోటోలు బయట పెట్టాలన్నా ఎంతో ధైర్యం ఉండాలి. అయితే ఆ ధైర్యం నాకు టన్నుల్లో ఉంది అంటూ, తను మేకప్ లేకుండా ఉన్న పిక్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది కాజల్ అగర్వాల్. 'మేకప్‌, అలంకరణ.. ప్రపంచానికి మనల్ని అందంగా కనిపించేలా చేస్తుంది. కానీ అది మన వ్యక్తిత్వాన్ని ఏమీ చూపదు కదా? నిజమైన అందం అంటే మనం ఎలా ఉన్నామో అలాగే మనల్ని మనం స్వీకరించుకోవడమేనని చెప్పుకొచ్చింది. 'మనం శారీరక ఆకర్షణకు క్రేజ్‌ ఉన్న ప్రపంచంలో జీవిస్తున్నాం. సౌందర్య సాధనాల ఉత్పత్తుల కోసం మనం బిలియన్ల కొద్దీ డబ్బు వెచ్చిస్తున్నాం. మనల్ని మనం సహజంగా స్వీకరించుకోవడంలోనే నిజమైన ఆనందం ఉందని కాజల్ పేర్కొంది.

More Related Stories