English   

రాక్షసి గా మారిన జ్యోతిక..

rakshasi
2019-06-02 07:59:35

వివాహం తర్వాత కూడా నట జీవితం వదలని వారు కొందరే ఉంటారు, అలాంటి వారిలో నటుడు సూర్య భార్య జ్యోతిక ముందు వరుసలో వుంటుంది. సాధారణ సినిమాలు కాకుండా విలక్షణ సినిమాలు మాత్రమే చేస్తూ వెళ్తున్న ఆమె గత ఏడాది ఝాన్సీ అనే సినిమా, మణిరత్నం దర్శత్వంలో నటించిన సెక్క సివంద వానం సినిమాలు సూపర్ హిట్ గా నిలిచిన సంగతి. కొత్త దర్శకుడు రాజ్‌ దర్శకత్వంలో ఒక సినిమా చేసింది జ్యోతిక. ఈ సినిమాలో జ్యోతిక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇందులో జ్యోతిక ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలి పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం.

డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ పతాకంపై ఆర్ఎస్‌.ప్రకాశ్, ఆర్ఎస్‌. ప్రభు నిర్మిస్తున్న ఈ సినిమాలో జ్యోతిక లుక్, టైలర్‌ను తాజాగా రిలీజ్‌ చేశారు. ఇక టీచర్ గా జ్యోతిక లుక్ సరిగ్గా సరిపోయింది. ఇక ఈ సినిమా జూన్‌లో రిలీజ్‌ కానుంది. ఇక ఈ సినిమాలో నటి పూర్ణిమా భాగ్యరాజ్, సత్యరాజ్, హరీశ్‌ పెరడీ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ సినిమా టైటిల్ ఏంటో తెలుసా... రాక్షసి.

More Related Stories