English   

శంకర్ కి షాక్ ఇచ్చిన లైకా ప్రొడక్షన్స్

shankar
2019-06-02 08:20:56

ఇండియాలో ఉన్న మోస్ట్ టాలెంటెడ్ దర్శకుల్లో తమిళ దర్శకుడు శంకర్ ఒకరు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలు దొరికింది శంకర్ మీద ఒక అపవాదు ఉంది. అదేంటంటే భారీ బడ్జెట్ సినిమాలకి అలవాటు పడ్డ ఆయన ముందు అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువ ఒక్కోసారి డబుల్ కూడా ఖర్చు చేస్తాడనే విషయం అందరికీ తెలిసిందే. ఇక ఆయన దర్శకత్వంలో '2.ఓ' సినిమాను నిర్మించిన లైకా ప్రొడక్షన్స్ వారు, ఆయనతో 'భారతీయుడు 2'ను కూడా నిర్మించడానికి రంగంలోకి దిగారు. అయితే, తొలి షెడ్యూల్ పూర్తయ్యాక ఈ సినిమా షూటింగ్ అర్ధాంతరంగా ఆగిపోయింది, అయితే ఈ సినిమాలో హీరో కమల్ హాసన్ కాబట్టి ఆయన పార్టీ తరఫున లోక్ సభ కు కోసం ప్రచారం చేసుకునేందుకు సినిమా షూటింగ్ ఆపారని వార్తలు వచ్చాయి.

కానీ దాని వెనుక మరో కారణం కూడా ఉందని తెలుస్తోంది, అదంటే ఆ మొదటి షెడ్యుల్ షూటింగులోనే ఆ షెడ్యూల్ బడ్జెట్ కి మించి శంకర్ ఖర్చు చేయించాడట. దాంతో నిర్మాతలు సినిమా మొత్తానికి బడ్జెట్ వేసి, ఎలాంటి పరిస్థితుల్లోనూ అది దాటకూడదని శంకర్ కి దిశానిర్దేశం చేశారు. ఒకవేళ ఆ బడ్జెట్ దాటితే శంకర్ కి ఇచ్చే పారితోషికం నుంచి కట్ చేయడం జరుగుతుందని క్లారిటీ ఇచ్చారట. ఆ పారితోషికాన్ని మించి కూడా ఖర్చు చేస్తే, అది శంకర్ పెట్టుకోవాల్సి వస్తుందని పేర్కొంటూ ఒక అగ్రిమెంట్ తయారు చేయించడంతో శంకర్ మరో నిర్మాణ సంస్థని రంగంలోకి దింపడానికి ప్రయత్నాలు చేసినా అవి ఫలించలేదు. దాంతో తప్పక శంకర్ ఆ అగ్రిమెంట్ పై సంతకం చేశాడనే టాక్ కోలీవుడ్ లో వినిపిస్తోంది. అంటే ఈ సినిమా బడ్జెట్ లోనే తీసి నిర్మాతల చేతిలో పెడతారన్నమాట.

More Related Stories