English   

మళ్లీ డైరెక్టర్ గా బాధ్యతలు తీసుకున్న లారెన్స్

laxmibomb
2019-06-02 09:54:06

బాలీవుడ్​ చిత్రం 'లక్ష్మీబాంబ్' సంబంధించిన వివాదం సద్దుమణిగినట్టే, నిర్మాత‌ల‌తో లారెన్స్ జ‌రిపిన‌ చ‌ర్చ‌లు సఫలం కావడం తో హిందీలో కాంచ‌న రీమేక్‌గా తెర‌కెక్కుతున్న ల‌క్ష్మీ బాంబ్‌ని రాఘ‌వ లారెన్స్ డైరెక్ట్ చేయ‌నున్నాడు. ఈ విషయాన్ని ట్విట్టర్​ వేదికగా ప్రకటించారు లారెన్స్. ఆ మ‌ధ్య ల‌క్ష్మీ బాంబ్ చిత్ర ఫ‌స్ట్ లుక్‌ని త‌న‌కి తెలియ‌కుండా విడుద‌ల చేసార‌ని ఆవేద‌న చెందిన లారెన్స్ ఈ ప్రాజెక్ట్ నుండి త‌ప్పుకున్న‌ట్టు ప్ర‌క‌టించాడు. ఆత్మ‌గౌర‌వం అనేది మ‌నిషికి చాలా ముఖ్యం. అది లేని చోట ప‌నిచేయడం క‌ష్టం. అందుకే నేను కాంచ‌న రీమేక్ చిత్రం నుండి త‌ప్పుకుంటున్నాను అని తెలిపారు. తాజాగా నిర్మాతల తో చర్చలు సఫలం కావడంతో  ఈ సినిమాను తెరకెక్కించేందుకు సిద్ధమయ్యాడు దర్శకుడు రాఘవ లారెన్స్. "మళ్లీ దర్శకుడిగా బాధ్యతులు తీసుకున్నా. లక్ష్మీ బాంబ్​ సినిమాను తెరకెక్కించేందుకు సిద్ధంగా ఉన్నా. నా బాధని అర్థం చేసుకున్న హీరో అక్షయ్ కుమార్​కు ధన్యవాదాలు." అని ట్వీట్ చేశారు.

More Related Stories