English   

దటీజ్ మహాలక్ష్మి కి ఏమైంది ?

thatismahalakshmi
2019-06-02 10:28:08

హిందీలో సూపర్ హిట్ అయినా క్వీన్ సినిమాని ఒకే సారి తెలుగు , తమిళ్ , మలయాళం , కన్నడ లో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. తెలుగులో తమన్నా, తమిళంలో కాజల్, మలయాళంలో మంజిమా మోహన్, కన్నడలో పరుల్ యాదవ్ లు కంగనా నటించిన పాత్రల్లో నటిస్తున్నారు.

మిగతా బాషల్లో ఎలా ఉన్నా తెలుగులో దటీజ్ మ‌హాల‌క్ష్మీ అనే టైటిల్ తో రిలీజ్ చేస్తున్నారు. తెలుగు వ‌ర్షన్‌ని ఆ సినిమాని తెరకెక్కించిన  ప్ర‌శాంత్ వ‌ర్మ డైరెక్ట్ చేస్తున్నాడు. అయితే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యి చాల రోజులే అవుతున్న రిలీజ్ కు మాత్రం నోచుకోవడం లేదు. ప్రస్తుతం మార్కెట్ అంతగా సరిగా లేకపోవడంతో కొన్ని రోజులుగా ల్యాబ్ లోనే మూలుగుతోంది ఈ సినిమా. అప్పట్లో రిలీజ్ చేయాలి అనుకుని టీజర్, ఫస్ట్ లుక్ అంటూ కాస్త హడావిడి కూడా చేశారు. కానీ ప్రీ బిజినెస్ మాత్రం ఆశించిన స్థాయిలో జరక్కపోవడంతో తాత్కాలికంగా పక్కన పెట్టేశారు. నిజానికి అనుష్క, కాజల్, నయన తార వంటి వాళ్ళతో పోల్చుకుంటే  తెలుగులో తమన్నా కు మార్కెట్ లేదు. తాజాగా ఆమె నటించిన అభినేత్రి 2 కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చి డిజాస్టర్ టాక్ రావడంతో ఆ ఎఫెక్ట్ కూడా ఈ సినిమా ఫై ఖచ్చితంగా పడుతుంది. దీంతో ఈ సినిమా ఇప్పట్లో రిలీజ్ అవుతుందా లేదా అనేది సందేహంగా మారింది. ఇక ఇది తమన్నా బ్యాడ్ టైం అనుకుందాం అంటే తమిళ్ సహా మిగతా భాషల్లో క్వీన్ రీమేక్ చిత్రాలు రిలీజ్ అవుతున్నాయా అదికూడా లేదట. ఏమవుతుందో ఏమో మరి చూడాలి.

More Related Stories