English   

క్రేజీ జూనియరా ? సీనియరా ?

vijay
2019-06-02 11:54:28

తమిళ స్టార్ హీరో విజయ్‌ ప్రస్తుతం తన 63వ చిత్రంలో నటిస్తున్నారు. అట్లీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. ఏజీఎస్‌ సంస్థ భారీ బడ్జెట్‌లో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో విజయ్ ఫుట్ బాల్ ప్లేయర్ గా నటిస్తున్నాడు. విజయ్, అట్లీ కాంబినేషన్‌లో ఇంతకు ముందు తెరి, మెర్శల్‌ వంటి సక్సెస్‌ఫుల్‌ చిత్రాలు రావడంతో తాజా చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. బ్రేక్ లు లేకుండా షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ సినిమాని దీపావళికి తెరపైకి తీసుకురావడానికి మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నారు.

ఈ చిత్రం నిర్మాణంలో ఉండగానే విజయ్‌ 64వ చిత్రం గురించి రకరకాల ప్రచారం జోరందుకుంది. విజయ్‌ చిత్రానికి లోకేశ్‌ కనకరాజ్‌ దర్శకత్వం వహించనున్నారని అంటున్నారు. దీనికి లోకేశ్‌ కనకరాజ్‌ దర్శకత్వం వహించనున్నారనీ ఆయనే స్వయంగా క్లారిటీ ఇవ్వడంతో మరో ప్రచారం మొదలయ్యింది. ఈ సినిమాలో విజయ్‌ సరసన  హీరోయిన్   రష్మిక మందన నటించబతుందనే ప్రచారం  వైరల్‌ అయ్యింది. ఇక తాజాగా నటి త్రిష పేరు వెలుగులోకి వచ్చింది. విజయ్, త్రిషలది హిట్‌ పెయిర్‌ అనిపించుకున్న నేపథ్యంలో విజయ్‌ సరసన నటి త్రిషను ఎంపిక చేశారని ప్రచారం సాగుతోంది. అయితే దీని మీద అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

More Related Stories