English   

ఇంట్లో అంత విషాదం జరిగితే….పార్టీలా ?

ajay
2019-06-02 12:32:21

అజయ్ దేవగన్ తండ్రి వీరు దేవగన్ కొన్ని రోజుల క్రితం హఠాత్తుగా గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే.  అజయ్ దేవగన్ ఇంట చోటు చేసుకున్న  ఈ విషాదం అందరిని శోకసముద్రంలో ముంచేసింది.  బాలీవుడ్ ప్రముఖులు అజయ్ ఇంటికి వచ్చి ఓదార్చారు. వారి కుటుంబం ఇంకా ఆ విషాదం నుంచి తేరుకోలేదు. ఇది జరిగిన మరుసటి రోజు కాజోల్ మదర్ కూడా అనారోగ్యంతో హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు. ఇంత జరిగి ఆ కుటంబం బాధలో ఉంటే  అజయ్‌దేవ‌గ‌న్‌ కాజోల్ ల గారాల పట్టి నైసా దేవగన్ మాత్రం తాతయ్య అంత్యక్రియలు జరిగిన మరుసటి రోజే ఓ రెస్టారెంట్ కు వెళ్లి సరదాగా స్నేహితులతో పార్టీ చేసుకుని అక్కడే లంచ్ చేసి బయటికి చలాకిగా వస్తూ ఫోటోలకు దొరికిపోయింది. దీనిని మీడియా ప్రముఖులంతా హైలైట్ చేయడంతో ఆమె మీద నెటిజెన్లు ఒక రేంజ్ లో విరుచుకు పడ్డారు. స్వయానా తాతయ్య చనిపోయి ఒక్కరోజు కాకముందే ఇలా బరితెగించి మరీ తిరగడం బాలేదని విమర్శలు చేస్తున్నారు.  నైసా దేవగన్ నిజంగానే ఆ ఫోటోలలో నవ్వుతు యమ హుషారుగా కనిపిస్తోంది.

More Related Stories