English   

మరో ఇంటిదయిన తాప్సీ ?

tapsee
2019-06-02 13:04:14

అదేంటి తాప్సీ ఎంటి ఒకింటిది అవడం ఏమిటి అనుకుంటున్నారా ?, టాలీవుడ్‌ లో సరయిన అవకాశాలు లేని ఆమె  బాలీవుడ్‌కి షిఫ్ట్ అయింది. దాంతో తెలుగులో ఎంతో డ‌ల్‌గా ఉన్న ఆమె కెరీర్ ఓ రేంజ్‌లో పరుగులు పెడుతోంది. దీంతో ఆమె రెండేళ్ళ క్రితమే ముంబైలో ఒక త్రిబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ కొనుగోలు చేసిందట. దానికి తన చెల్లి శగున్ చేత ఇంటీరియర్స్ కూడా చేయించుకుందట. గత ఏడాది ఆ ఫ్లాట్ కు షిఫ్ట్ అయిన ఆమె ఒక వ్యానిటీ వ్యాన్ ఒక ఖరీదైన లగ్జరీ కారు కూడా కొనేసుకుందట. అంతేకాదు ఈమధ్య తను నివాసం ఉండే అపార్ట్ మెంట్ కాంప్లెక్స్ లో మరో ఫ్లాట్ బేరానికి రాగానే ఆలస్యం చేయకుండా ఆ ఫ్లాట్ ను కొనుగోలు చేసిందట. ఈ కొత్త ఫ్లాట్ కు ఇంటీరియర్స్ చేసే బాధ్యతను కూడా  చెల్లికే అప్పగించిందట. ఆమె రెండేళ్లలో రెందిళ్లు కొనుక్కుంది అది కూడా ముంబై లాంటి చోట అంటే ఈ లెక్కన బాలీవుడ్ లో తాప్సీ సంపాదన గట్టిగా ఉన్నట్టే. ఆ సంపాదనను తెలివిగా రియల్ ప్రాపర్టీస్ మీద ఇన్వెస్ట్ చేస్తోందన్నమాట.

More Related Stories